జగన్ వి అన్ని మోసాలే

జగన్ వి అన్ని మోసాలే

Share with
Views : 12
జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు ఇలాగే ఉంటాయి. కానీ మేనిఫెస్టోలో పెట్టిన అరకొర హామీలు కూడా అమలు చేయడానికి చేతులు రాలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పేరుతో చెప్పిన ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పారదర్శకంగా అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఎంత పారదర్శకంగా అమలు చేశారంటే.. అసలు రూపాయి కూడా కేటాయించలేదు. వారికి చెందాల్సిన నిధులను పథకాలకు మళ్లించారు. పథకాల పేరుతో పంచి.. అవే సబ్ ప్లాన్ నిధులుగా మార్చారు. ఇంకా అనేక పనులకు కూడా మళ్లించి అవి ఎస్సీల కోసమే చేశామని బుకాయిస్తున్నారు. అన్ని పథకాలకు ఇచ్చే డబ్బులు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇచ్చినవి కావు. వారు సమాజంలో వెనుకబడి ఉన్నారని అభివృద్ధి చేయడానికి అవసరం అని అదనపు నిధులు కేటాయిస్తూ.. వారి కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకు వచ్చారు. ఈ నిధులు దారి మళ్లించడం చట్ట విరుద్ధం. కానీ జగన్ సర్కార్ అద చేసింది. ఎస్సీ, ఎస్టీలను ఘోరంగా మోసం చేసింది. ఈ ప్రభుత్వమూ ఇలాంటి మోసం చేసేందుకు కూడా ఆలోచించలేదు. ప్రతీ హామీ మోసమే ! ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ తో పాటు ఉచితంగా బోరు వేయించి ఇస్తామని ఇచ్చారు. ఐదేళ్లలో ఒక్కరంటే ఒక్క రైతుకు భూమిని పంచలేదు. భూమిని పంచలేదు కాబట్టి బోరు వేయించే అవకాశం లేదు. ఎస్సీ,ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి లక్ష ఇస్తామని వైఎస్ఆర్ పెళ్లి కానుక అనే పథకాన్ని పెడతామని చెప్పారు. అసలు ఈ పథకాన్ని ఆపేశారు. కోర్టు వెళ్లడంతో నాలుగేళ్ల తర్వాత ప్రారంభిస్తున్నట్లుగా షో చేశారు. అదీ కూడా మైనార్టీలకు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కరికి కూడా సాయం చేయలేదు. గత ప్రభుత్వం .. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఎవరు పెళ్లి చేసుకున్నా రూ. 50వేల సాయం ఇచ్చేది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మోసం ఎస్సీ, ఎస్టీ కాలనీలు , గిరిజన తండాలలో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ లేదా ఏడాదికి ఆరువేల రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ గతంలో ఈ సబ్సిడీ పొందుతున్న పేదలకే షాకిచ్చారు. సబ్సిడీ ఎత్తేశారు. కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీల్ని దోచుకున్నారు. 500 జనాభా ఉన్న ప్రతి గూడెం, తండాగా పంచాయతీగా మారుస్తామన్నారే ! 500కు మించి జనాభా ఉన్న ప్రతి గూడెం, తండాను పంచాయతీగా మారుస్తామని ప్రకటించారు. ఈ అంశంపై ఐదేళ్లలో ఒక్క సారి ఒక్క సారి కూడా ఆలోచన చేసిన పాపాన పోలేదు. అసలు గుర్తు లేదు. Also Read: మేనిఫెస్టో మోసాలు : రైతు భరోసా రూ. 7500 ఎందుకయింది ? ఎస్సీ, ఎస్టీల విద్య, వైద్యంపై నిర్లక్ష్యం ఎస్సీ, ఎస్టీల విద్య, వైద్య సౌకర్యాలపై ఏ ప్రభుత్వం చూపించనంత నిర్లక్ష్యం చూపించారు. కేంద్రం గిరిజన వర్శిటీని ఇచ్చినా.. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగినా ..దాన్ని మరో చోటకు మార్చి అడుగు ముందుకు పడకుండా చేశారు. మెడికల్ కాలేజీ పేరుతో ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికి పునాదులు దాటలేదు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన బైక్ అంబులెన్స్ లు కూడా పక్కన పడేశారు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు ఇస్తామన్నారు. చంద్రన్న బీమా పేరుతో వచ్చే రెండు లక్షలను కూడా ఎగ్గొట్టారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తామన్న హామీ కూడా గాల్లో కలసిపోయింది. అసైన్డ్ భూములు లాక్కుని అరాచకం అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకోదని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ వచ్చీ రాగానే అసైన్ మెంట్ భూముల మీదనే పడ్డారు. విచ్చలవిడిగా లాగేసుకున్నారు. కొన్ని లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. పేదలకు ఇళ్ల పేరుతో ఈ దందా నడిపారు. ఈ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీల్ని వంచించినంత ఘోరంగా మరో ప్రభుత్వం ఎప్పుడూ వంచించలేదు. ఎంతో కొంత మంచి చేసే ప్రయత్నం చేశాయి. కానీ నమ్మి ఓట్లేసిన వారిని… జగన్ రెడ్డి తన బానిసలుగా భావించి..తాను ఏం చేసినా తనకే ఓట్లేస్తారన్నట్లుగా మోసం చేశారు. ఈ ఎన్నికల్లో వారు తాము బానిసలం కాదని నిరూపించే అవకాశం ఉంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले