తుస్సుమన్న బస్సు యాత్ర

తుస్సుమన్న బస్సు యాత్ర

Share with
Views : 13
జగన్ బస్సు యాత్ర ముగిసింది. రోజు మార్చి రోజు విరామం తీసుకుంటూ.. ఓ ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేయడానికి పాతిక రోజుల సమయం తీసుకున్నారు. ఏసీ బస్సు నుంచి దిగకుండా ఆయన చేసిన యాత్ర హైలెట్ అవుతుంది. ఈ యాత్ర ఆయన సీఎం హోదాలో చేశారు. కానీ విలాసాల విషయంలో మాత్రం ఆ పవర్ చూపించుకున్నారు. కానీ ప్రతిపక్ష తరహాలో యాత్రి స్క్రీన్ ప్లే రెడీ చేసుకుని ప్లే చేశారు. వందల మంది బాధితుల్ని కలిశారు. ఐదేళ్ల పాటు వారిని ఎందుకు ఆదుకోలేకపోయారో మరి ! ఐ ప్యాక్ రెడీ చేసిన వారు తప్ప ఎవరూ కలవలేని విధంగా బస్సు యాత్ర సాగింది. బస్సు యాత్రలో చాలా చోట్ల సభలు పెట్టారు. మొత్తం సభల్లో ఒకటే స్పీచ్. తాను ఇన్ని బటన్లు నొక్కానని చెప్పుకోవడం.. చంద్రబాబు, పవన్ మీద పడి ఏడవటం. వారి కలిసి వస్తున్నారని.. తాను సింహం సింగిల్ నని చెప్పుకోవడం. తల్లి, చెల్లిని కూడా తరిమేసి సింగిల్ నని చెప్పుకోవడం ఓ వింత అయితే చంద్రబాబు, పవన్ మీద తన స్పీచ్ లో సగం ప్రసంగం ఏడవడం మోర వింత. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈసీ నోటీసులు ఇచ్చినా ఆయన తగ్గడం లేదు. బస్సు యాత్రలో కోడికత్తి తరహాలో .. గులకరాయి డ్రామా పండించారు. ఖచ్చితంగా బస్సు యాత్ర సగంలోకి వచ్చాక ఈ డ్రామా ప్రారంభమయింది. అసలు రాయి దొరికిందో లేదో ఎవరికీ తెలియదు.. తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ఓ కుర్రాడిని లోపలేశారు. టీడీపీ నేతల్ని ఇరికించడనికి చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. కానీ జగన్ మోహన్ మీద స్టిక్కర్ మాత్రం అలాగే ఉండిపోయింది. అంతే కాదు ఆ రాయి.. వెల్లంపల్లి రాజకీయానికి కూడా ఉపయోగపడింది. ఆయన కన్నుకు కట్టు కట్టుకుని తిరుగుతున్నారు. బస్సు యాత్రలో జనం లేకపోవడం వైసీపీకి పెద్ద షాక్. రాయలసీమలోనూ జనం కనిపించలేదు. తోలుకొచ్చిన వాళ్లు తప్ప ఇంకెవరూ దరిదాపుల్లోకి రాలేదు. పరిస్థితి గమనించి మధ్యలో బస్సు యాత్ర విరమించాలనుకున్నారు కానీ.. వ్యతిరేకత ప్రచారం జరుగుతుందని గ్రాఫిక్స్ మీద ఆధారపడి యాత్ర కొనసాగించారు. మొత్తంగా.. విపక్షాలపై ఏడవడానికే.. బస్సు యాత్ర చేపట్టినట్లుగా ఉందని అనుకోవచ్చు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले