సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కు ప్రాణహాని

సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కు ప్రాణహాని

Share with
Views : 8
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి విశ్వసనీయంగా అందిన సమాచారమేనని భావిస్తున్నారు. తనకు అందిన సమాచారంతో పాటు ఫిర్యాదును నేరుగా సీపీకి జేడీ లక్ష్మినారాయణ ఇచ్చారు. ఆయన పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి కేసుల్ని సీబీఐ జేడీగా ఉన్నప్పుడు వీవీ లక్ష్మినారాయణ డీల్ చేశారు. వీరిద్దర్నీ అరెస్టు చేశారు. పకడ్బందీగా దర్యాప్తు చేసి.. చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. వీటిపై నిందితులు రకరకాల పిటిషన్లు వేసి ట్రయల్ ఆలస్యం చేసుకుంటున్నారు. అదే సమయంలో బెయిల్ కోసం ఏకంగా జడ్జికే లంచం ఇస్తూ.. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు దొరికిపోయారు. వారిని కూడా జైల్లో పెట్టారు. తర్వాత సీబీఐ జాయింట్ డైరక్టర్ గా రిలీవ్ అయి మహారాష్ట్ర క్యాడర్ కు వెళ్లిపోయారు. అక్కడ ఉన్నతాధిరిగా కీలక పదవిలో ఉన్నప్పటికీ ముందస్తు రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి సొంత పార్టీ తరపున విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో సీబీఐలో ఉన్నప్పుడు దర్యాప్తు చేసిన కేసుల్లోని నిందితులు తనపై దాడికి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం ఆయనకు అందినట్లుగా తెలుస్తోంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले