వై యస్ వారసులు ఎవరు

వై యస్ వారసులు ఎవరు

Share with
Views : 9
వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే వారసత్వం ఇచ్చారు. గత ఎన్నికల వరకు షర్మిల, విజయమ్మ , సునీత కూడా ఆయనకే వారసుడు బిరుదు ఇచ్చారు. కానీ ఇప్పుడు షర్మిల రూపంలో వారసత్వానికి పోటీ వచ్చింది. ఆ పోటీ గురించి జగనే చెప్పుకొచ్చారు. వీళ్లా వారసులు అంటూ షర్మిల కట్టుకున్న చీర గురించి.. చంద్రబాబును తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడం కూడా తప్పన్నట్లుగా మాట్లాడారు. వీళ్లా వారసులు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. జగన్ మాట్లాడిన మాటలు చూసి వైఎస్ అభిమానులు కూడా దిక్కులు చూసుకున్నారు. సొంత చెల్లిని రాజకీయంగా విబేధిస్తే ఇలా కూడా అంటారా అని ఆశ్చర్యపోయారు. ఆయన భాష చాలా ఘోరంగా ఉంది. సొంత వాళ్లను ఘోరంగా కించపర్చినట్లుగా ఉంది. ఈ భాషపై షర్మిల కూడా విరుచుకుపడ్డారు. ఆమెకు ఎంత కోపం వచ్చిందంటే ఇంత కాలం బయట పెట్టని నిజం కూడా బయట పెట్టారు. సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరు పెట్టించింది జగనేనని స్పష్టం చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పిటిషన్ వేయించి మరీ పెట్టించారన్నారు. ఇది నిజమే. కానీ దీన్ని చాలా తెలివిగా ఇంత కాలం తొక్కి పెట్టడమే కాకుండా సోనియా మీద నిందలేశారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల షర్మిల లేకపోతే సునీత ఆత్మస్థైర్యం తగ్గిపోతుందని అనుకుంటే అంత కంటే అమాయకమైన రాజకీయం ఉండేదమో. జగన్ ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల షర్మిల, జగన్ మధ్య జనం పోల్చి చూసుకునే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ రాజకీయ వారసత్వం తీసుకునేంత పరిణితి జగన్ కు లేదన్న అభిప్రాయానికి వస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. జగన్ తన ప్రచారాన్ని కొనసాగించే కొద్దీ.. షర్మిల అంత బలపడటం ఖాయంగా కనిపిస్తోంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले