టిడిపి లోకి డొక్కా

టిడిపి లోకి డొక్కా

Share with
Views : 9
ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత అటూ ఇటూ ఊగిసలాడి చివరికి టీడీపీలో చేరారు. దళిత మేధావి కావడంతో చంద్రబాబు కూడా ఆయనకు ముందు ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ సీటిచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన అసలు రాజకీయం చేశారు. జగన్ మూడు రాజధానుల రాజకీయం చేస్తున్నప్పుడు.. శాసనమండలిలో టీడీపీకి మద్దతుగా ఉండకుండా..రాజీనామా చేశారు. ఇందు కోసం ఆయన చెప్పిన కారణం.. అమరావతికి అన్యాయం జరుగుతోందని. జగన్ అమరావతికి అన్యాయం చేస్తున్నాడని రాజీనామా చేసి.. మళ్లీ వైసీపీలో చేరి టీడీపీపై విమర్శలు చేశారు. తాను రాజీనామా చేస్తే ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును జగన్ ఇస్తే తీసుకుని అదే పదవిలో కొనసాగారు.అంటే అది సాంకేతికంగా టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవినే. తర్వాత జగన్ ఆయనతో ఓ ఆట ఆడుకున్నారు. తాడికొండకుకు ఇంచార్జ్ గా పెట్టి చెప్పకుండా తీసేశారు. కనీసం అపాయింట్ మెంట్ లేదు. బహిరంగంగా బతిమాలుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా పట్టించుకోవడం లేదు. ఈ అవమానాలు భరించలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. నామినేషన్లకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆలస్యం చేశారు. మరి ఇప్పుడు ఎక్కడ చేరుతారో ఇంకా స్పష్టత రాలేదు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले