భువనేశ్వరి పేరుతో ఫేక్

భువనేశ్వరి పేరుతో ఫేక్

Share with
Views : 15
ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్ తయారు చేసి అది ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయిందన్నట్లుగా వీడియో చూసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉందని.. ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఆ ఆడియోలో నారా భువనేశ్వరి ఎవరినో తిడుతున్నట్లుగా ఉంది. కులం ప్రకారం తిడుతున్నట్లుగా ఉంది. ఆ ఆడియో చూడగానే ఎవరికైనా డీప్ ఫేక్ అని తెలిసిపోతుంది.అంత కృతకంగా స్క్రిప్ట్ ఉంది. ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లుగా అలా ఎవరూ మాట్లాడరు. భువనేశ్వరి ఇటీవల బహిరంగసభల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగాల మాడ్యులేషన్ తీసుకుని డీప్ ఫేక్ సృష్టించారు. జగన్ రెడ్డి సొంత చెల్లిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న సమయంలో ఈ డీప్ ఫేక్ రిలీజ్ చేయడం వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతున్న పరిస్థితుల్లో మరింత దారుణమైన కుట్రలు పన్నెందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లుగా కనిప్తోంది. ఇటీవల వైసీపీ ముందుంజలో ఉందని టీడీపీ నేతలు సమావేశంలో చెప్పుకున్నారంటూ ఓ డీప్ ఫేక్ వీడియోను విడుదల చేసి కూలీ మీడియాలో ప్రసారం చేసుకున్నారు. ముందు ముందు ఇలాంటి వాటితో చెలరేగిపోతారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले