Share with
Views : 22
చం ద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని టీడీపీ మండల కమిటీ సంతబొమ్మాళి. మారువాడ పంచాయతీ లో ఇంటింటి ప్రచా రం చేశారు. మండల కమిటీ కి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షులు జేరు భీమారావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతినెలా రూ.15వందలు ఖాతాలో జమ చేస్తారన్నారు. అలాగే ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌సిలిండర్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులోఉచిత ప్రయాణం కల్పిస్తారన్నారు. అమ్మకు వందనం పథకం ద్వారా ఇంట్లో చదివే పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15వేలు లబ్ధి చేకూరుస్తారని తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద యేడాదికి రూ.20వేలు అందిస్తారని వివరించారు. కనుక వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. సైకిలు గుర్తుకు ఓటు వేసి MLA అచ్చెన్నాయుడు గారిని,MP రామ్మోహన్నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో *మరువాడ సర్పంచ్ సూరాడ.ధనలక్ష్మి దాసురాజు* ఆధ్వర్యంలో మండల తెదేపా అధ్యక్షులు జీరు భీమారావుగారు,అలాగే ప్ర ధాన కార్యదర్శి రెడ్డి.అప్పన్న తో పాటు మండల పం చాయతీ ముఖ్యనాయకులు,తెలుగుయువత,ఐటిడిపి,తెలుగుమహిళ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले