జగన్ వైయస్ వారసుడు ఎలా అవుతాడు. షర్మిల మాటల్లో

జగన్ వైయస్ వారసుడు ఎలా అవుతాడు. షర్మిల మాటల్లో

Share with
Views : 19
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. దెందులూరులో షర్మిల సభ అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలిసులు చేతులేత్తయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పోలిసుల నిర్లక్ష్యం కారణంగా షర్మిల కాన్వాయ్ గంటకు పైగా ట్రాఫిక్ లోనే చిక్కుకుంది. షర్మిల సభ ముగియగానే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఎవరూ కనిపించలేదు. ఎస్పీకి షర్మిల ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ట్రాఫిక్ క్లియర్ చేసే బాధ్యత తీసుకొని షర్మిల వెళ్లే రూట్ ను క్లియర్ చేశారు. జగన్ రెడ్డిపై షర్మిల విమర్శల డోస్ పెంచేశారు. అసలు వైఎస్ వారసుడు జగన్ రెడ్డి కాదని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. దాంతో షర్మిలపై ఆగ్రహంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సొంత చెల్లిపై కూడా జగన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. వై నాట్ 175అంటూ బీరాలు పలుకుతోన్న జగన్ షర్మిల రాజకీయానికి ఎందుకు బెదురుతున్నారని ప్రశ్నిస్తున్నారు. షర్మిలను అడ్డుకునేలా ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని వైసీపీ సర్కార్ కు హితవు పలుకుతున్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले