దూసుుపోతున్న గోండు శంకర్

దూసుుపోతున్న గోండు శంకర్

Share with
Views : 11
శ్రీకాకుళం: ధర్మాన ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్నికల్లో తాను విజయదుందుభి మోగించడం ఖాయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రకటించారు. కుట్రలపై వున్న చిత్తశుద్ధి మున్సిపల్ ఎన్నికలపై లేదని ధర్మానను విమర్శించారు. నగర పరిధిలోని 48వ డివిజన్ ఫాజుల్ బాగ్ పేటలో సురకాసి వెంకటరావు ఆధ్వర్యంలో శనివారం ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ పధకాల ప్రచారంలో గొండు శంకర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ, వారి సమస్యలు వింటూ. నేనున్నా అన్న భరోసానిచ్చారు. ఈ సందర్బంగా శ్రీశయన వీధిలో కుటుంబాలు మొత్తం గొండు శంకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ, నామినేషన్ ఘట్టానికి తరలివచ్చిన ప్రజలను చూసి ఓటమి భయంతో ధర్మాన వెన్నులో వణుకు పుట్టిందనారు. ఆ భయంతోనే కుట్రలు, కుతంత్రాలకు తెర తీసారని, గొడవలు, అల్లర్లు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. మైండ్ గేమ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికే మూడు నాలుగు బృందాలను నియోజకవర్గం నలుమూలలకు పంపారన్నారు. లక్ష మంది వచ్చినా తగ్గేదేలేదని, ధర్మాన కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నానని స్పష్టం చేసారు. ఆయన కుట్రలకు సరైన దెబ్బ అరసవల్లి శ్రీ శయన వీధిలో తగిలిందని చెప్పారు. ఈ కుట్రలపై ఉన్న చిత్తశుద్ధి మున్సిపల్ ఎన్నికలపై పెట్టివుంటే తన కింద కార్యకర్తలు నాయకులు అయివుండేవారని ఎద్దేవా చేసారు. కార్యకర్తలు నాయకులు కాకూడదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన అరునెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కార్యకర్తలను కార్పొరేటర్లను చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చేయని ధర్మాన ఏ మొఖం పెట్టుకుని ఓటు అడుగుతారని ప్రశ్నించారు. డివిజన్లోని శ్రీ శయన కుటుంబాలు పార్టీలో చేరడం ఆనందంగా ఉందని. వారికి అండగా ఉంటానని హామీనిచ్చారు. ఏ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శిల్లా శ్రీనివాసరావు, మడ్డి అప్పలరాజు, ఆలపాన గోవిందరెడ్డి, తిప్పనా రామారావు, బచ్చు ఈశ్వర్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ఇంచార్జిలు. అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले