అయ్యో ,జగన్ మేనిఫెస్టో కథ మొత్తానికి అలా ముగిసింది!*

అయ్యో ,జగన్ మేనిఫెస్టో కథ మొత్తానికి అలా ముగిసింది!*

Share with
Views : 13
*జగన్ మేనిఫెస్టో కథ మొత్తానికి అలా ముగిసింది! మీడియా తో సహా వైసీపీ నేతలను సైతం కంగుతినిపించిన సిఎం* ఎపిలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ మేనిఫెస్టో ప్రకటన అంశం ఏనుగు ఏదో చేసింది అన్నచందంగా మారింది. జగన్ ప్రజలను మోసం చేయబోయి తనను తాను మోసం చేసుకుని ఇటు మీడియాను మోసం చేసి, అటు సాక్షి బృందాన్ని మోసం చేసి...మేనిఫెస్టో ప్రకటనను ఒక ఫార్సుగా చేశాడు. మేనిఫెస్టో గురించి 24 గంటలూ మాట్లాడే సిఎం మేనిఫెస్టో ప్రకటిస్తున్నారంటే చాలా అటెన్షన్ వచ్చింది. తీరా జగన్ ప్రసంగం, చంద్రబాబు పై దూషణలు, మేనిఫెస్టో ప్రకటనలలో మోసపూరిత వ్యాఖలు చూసి సొంత వర్గ వాళ్లు కూడా ఊసురు మన్నారు. 10 ఏళ్ల పాలన అంటూ...గడిచింది..వచ్చేదీ కలిపి పథకాల గురించి వివరించిన తీరు చాలా అసహ్యాన్ని కలిగించింది. మీకు ఇక్కడ సింపుల్ గా రెండు ముక్కల్లో చెపుతా...జగన్ చేయూత అనే పథకాన్ని ఏడాదికి రూ.18750 చొప్పున 4 ఏళ్లలో రూ.75 వేలు ఇచ్చినట్లు చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది...అయితే దీన్ని వచ్చే 5 ఏళ్లలో పెంచి రూ.1.50 లక్షలు ఇస్తాను అని స్పష్టంగా చెప్పాడు. దీంతో అక్కడ ఉన్న మీడియా వాళ్లు, టీవీ స్టూడియోల్లో ఉన్నవాళ్లు, వీటినే బ్రేకింగ్ లుగా పెట్టారు. తీరా మేనిఫెస్టో సాఫ్ట్ కాపీ చేతిలో పడగానే కంగుతిన్నారు. గడిచిన 4 ఏళ్లుతో పాటు వచ్చే ప్రభుత్వంలో ఇచ్చేది కలిపి రూ.1.50 లక్షలు ఇస్తాను అని జనగ్ చెప్పినట్లు తెలుసుకున్నారు. ఈ రహస్యం, ఈ కుట్ర అర్థం చేసుకోని సాక్షి కూడా చేయూత డబుల్ అంటే వార్తలు వేసింది. కాపు నేస్తం, వైఎస్ ఆర్ ఈబీసీ నేస్తం విషయంలో కూడా డబుల్ చేస్తున్నట్లు సిఎం ప్రకటించాడు. అయితే మేనిఫెస్టోలో మాత్రం తూచ్ అన్నాడు. దీంతో వైసీపీ పెద్దలు.....మీడియా ఆఫీసులకు ఫోన్లు చేసి బ్రేకింగ్ మార్పించారు సాక్షిలో ఆ తరువాత తేరుకుని సిఎం ఆఫీస్ వాళ్లు చెప్పిన తరువాత పెంపు లేదు...కొనసాగింపే అని కనిపించీ కనిపించకుండా రాశారు. తాను ఏకంగా రూ. 1.50 లక్షలు ఇవ్వబోతున్నాను అని పెద్ద సంఖ్య చెప్పే కక్కుర్తిలో సిఎం చాలా చీప్ ట్రిక్ ప్లే చేశాడు. దీంతో అటు వైసీపీ వాళ్లు సొంత సెక్షన్ వాళ్లు కూడా ముక్కున వేలుసుకున్నారు. అసలే మేనిఫెస్టో అంతంత మాత్రం అని నిర్వేదంలో ఉన్న వైసీపీ క్యాడర్ కు, లీడర్ కు...జగన్ మార్క్ ఈ మోసం మరింత అవేదనను, ఆగ్రహాన్ని తెప్పింది. మరోవైపు మేనిఫెస్టో తో విరుచుకుపడదాం అనుకున్న వైసీపీ సోషల్ మీడియా ఈపరిణామాలకు తేలుకుట్టిన దొంగలా సైలెంట్ అయ్యింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले