వైకాపా అసత్య ప్రచారాలను నమ్మొద్దు: తెదేపా నాయకురాలు గోండు స్వాతి

వైకాపా అసత్య ప్రచారాలను నమ్మొద్దు: తెదేపా నాయకురాలు గోండు స్వాతి

Share with
Views : 7
గార:వైకాపా అసత్య ప్రచారాలను నమ్మొద్దు నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ గార మండలం రామచంద్రపురం పంచాయితీ జొన్నలపాడు గ్రామంలో అంబటి చక్రధర్, సాధు శ్రీరామ్, కుంచాల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలన రాష్ట్రంలోగత అయిదేళ్లు కొనసాగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం లేకపోయినా తలసారి అప్పులు మాత్రం పెరిగిపోయాయన్నారు. నిత్యవసర సరుకులు, పెట్రోల్, గ్యాస్ ఇలా అన్ని ధరలు పెరిగి సామాన్యుడి బతుకు దుర్బరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం, ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పారు. ఎన్దియే అధికారంలోకి వస్తే మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో, సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల ఆర్ధిక, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పధకాలను రద్దు చేస్తారని ఓటమి భయంతో వైకాపా నేతల అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజక అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले