గ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి* ..........

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి* ..........

Share with
Views : 9
రాజమండ్రి : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి* ............. *రాజమండ్రిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వై. వి.బి.రాజేంద్రప్రసాద్ పిలుపు* సర్పంచుల మరియు గ్రామాల సమస్యల పైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి పట్టణంలోని హోటల్ రివర్ బే హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు *వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ* గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ఏకైక మార్గమని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రామ పంచాయతీలకు ఇవ్వవలసిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14,15వ ఆర్థిక సంఘం నిధులు 8629 కోట్ల రూపాయలు దొంగిలించి దారి మళ్లించి సొంత పథకాలకు వాడుకొని మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి పంపిన 15వ ఆర్థిక సంఘం నిధులు 988 కోట్లను గ్రామపంచాయతీలకు జమ చేయనందున వేసవికాలంలో కనీసం గ్రామీణ ప్రజలకు త్రాగునీరు అందించలేని పరిస్థితుల్లో ఈరోజు సర్పంచులు గ్రామపంచాయతీలు ఉన్నాయని అందుకనే *జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సర్పంచులకు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले