టిడిపి లోకి వరం వారసులు

టిడిపి లోకి వరం వారసులు

Share with
Views : 27
శ్రీకాకుళం:గుజరాతిపేట నుండి టీడీపీలోకి వరం వారసులు తెదేపాలో చేరారు.మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత ఆంధవరపు వరాహ నరసింహం (వరం) వారసులు బాబు సూపర్ సిక్స్ కి జై కొట్టారు. వరం తనయ పైడిశెట్టి జయంతి, కుమారులు ఆంధవరపు ప్రసాద్. సంతోష్ గుజరాతిపేటలోని 500 కుటుంబాలతో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారి స్వగృహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో పార్టీలో చేరిన వారికి రామ్మోహన్ నాయుడు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మునిసిపల్ చైర్మన్ గా వరం, పైడిశెట్టి జయంతి తన తండ్రి దివంగత ఎర్రంనాయుడుతో కలసి పనిచేసారని, నగరంలో ఎన్నో సేవలు అందించారని అదే ఒరవడిని కొనసాగించే అవకాశం మళ్ళీ వచ్చిందన్నారు. చంద్రన్న పాలనను తిరిగి తెచ్చుకోవాలని, నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. గత అయిదేళ్లలో ప్రజల ఆశలు ఆవిరి చేసారని, ప్రజలను నిర్లక్ష్యం చేసారని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగిందని చెప్పారు. గుజరాతిపేట వాసుల ఆదరణ చూస్తుంటే గొండు శంకర్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం కలుగుతుందని, ఏ నమ్మకంతో వారంతా పార్టీలో చేరారో ఆ నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా గౌరవప్రదంగా ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత నాయకులుగా తాము తీసుకుంటామని హామీనిచ్చారు. ఎంతో వత్తిడి, ఎన్నో ప్రలోభాలు వున్నప్పటికి వరం వారసులు ధైర్యంగా ప్రజల తరపున, అభివృద్ధి, సంక్షేమం వైపు నిలబడి టీడీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికి సముచిత స్థానం కల్పిస్తామని, అదేవిధంగా పార్టీలో ముందునుంచి వున్నవారిని నిర్లక్ష్యం చేయమని, అందరిని కుటుంబ సభ్యులుగా కలుపుకుని వెళ్లడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని చెప్పారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన గొండు శంకర్ అందరిని కలుపుకుంటూ ముందుకు వెళుతున్నారని, పేదల గుండె చప్పుడుగా నిలిచారని, రానున్న ఎన్నికలలో మీ అందరి ఆదరణతో ఘన విజయం సాధించి సామాన్యుడి పవర్ ఏంటో చూపిస్తారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తమ జోడుగుర్రాలను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పై నమ్మకంతో టీడీపీ ని బలోపేతం చేసేందుకు వరం వారసులు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు. వీరి చేరికతో నగరంలో గుజరాతిపేట టీడీపీ కంచుకోటగా మారిందన్నారు. చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కలసి కృషి చేద్దామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. అండవరపు, ఇప్పిలి కుటుంబాలు రాజకీయంగా చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. పొట్టి శ్రీరాములు మార్కెట్ కు ఆంధవరపు తవిటయ్య పేరును పెడతామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు, తినను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పైడిశెట్టి జయంతి బెనర్జీ మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ పధకాలు ప్రజల ఆర్ధిక. జీవన్ ప్రమాణాలు మెరుగు పరుస్తాయన్న నమ్మకం, చంద్రన్న పాలనతో ప్రజలకు మేలు జరుగుతుందన్న భరోసాతో తమ అనుచరుల మద్దతుతో టీడీపీలో చేరుతున్నామ్మన్నారు. గతంలో టీడీపీ హయాంలో పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. టీడీపీలోకి మల్లీ రావడం పుట్టినింటికి వచ్చినంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పార్టీలో అందరిని కలుపుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. తన తండ్రి వరం చేతుల మీదుగా ప్రారంభమైతే ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఎలా వుందో అలానే తమ చేరిక రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్, గొండు శంకర్ అఖండ విజయానికి శుభసూచికం అన్నారు. ఏ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ. జనసేన, బీజేపీ నాయకులు, డివిజన్ ఇంచార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले