గూడూరు లో బాలయ్య జోరు

గూడూరు లో బాలయ్య జోరు

Share with
Views : 7
గూడూరు లో బాలయ్యబాబు కార్యక్రమం కి పోటెత్తిన జన ప్రభంజనం. గూడూరు పట్టణం లో ఎటు చూసినా వెల్లువలా వచ్చిన అశేష ప్రజానీకం. స్వర్ణంద్ర సాకార యాత్రలో భాగంగా గూడూరు కి విచ్చేసిన టీడీపీ సీనియర్ నాయకులు, హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. గూడూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంNDA కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఘన స్వాగతం పలికారు. గూడూరు పట్టణం లో బాలయ్య బాబు కి గూడూరు ప్రజానీకం నీరజనాలు అందించారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. గూడూరు పట్టణం లోని కోర్టు సెంటర్ నుండి, టవర్ క్లాక్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ వస్తుండగా, అశేష జనవాహిని నడుమ బాలయ్య బాబు ప్రజలకు అభివాదం చేస్తూ సభాస్థలి కి చేరుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లో నందమూరి తారక రామారావు తనయుడు, హిందూపురం శాసన సభ్యులు బాలకృష్ణ చేపట్టిన స్వర్ణంద్ర సాకార యాత్రలో భాగంగా ఈరోజు గూడూరు పట్టణానికి విచ్చేయడం జరిగింది. NDA కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గూడూరు కోర్టు సెంటర్ లో బాలకృష్ణ కి భారీ పూలమాలలు, శాలువా లతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. NDA కూటమి తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, నెల్లూరు నుండి బాలకృష్ణ పర్యటన లో పాల్గొంటూ, గూడూరు కి బాలకృష్ణ తో పాటు విచ్చేసారు.డాక్టర్ పాశం సునీల్ కుమార్, టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి స్వాగతం పలికారు. కోర్టు సెంటర్ నుండి భారీ బైక్ ర్యాలీ మొదలయింది. జనాలు బాలయ్య బాబును చూసేందుకు తండోపాదండాలుగా విచ్చేయడం తో గూడూరు పట్టణం జన సంద్రం అయింది. కోర్టు సెంటర్ లో భారీ పూలమాలను క్రేన్ సహాయం తో బాలయ్య బాబు కి స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలు. కోర్టు సెంటర్ నుండి మొదలైన యాత్ర గూడూరు టవర్ క్లాక్ కి చేరుకునే సరికి దాదాపు గంట పైనే పట్టింది. ఒకవైపు నాయకులు ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ, పోలీస్ వారు కూడా ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. అడుగడుగునా బాలయ్య బాబుకు మహిళలు పూలబొకే లతో, పూలు చల్లుతూ జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలయ్య బాబు ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, టవర్ క్లాక్ దగ్గర సభ వద్దకు చేరుకుని ప్రసంగించారు. బాలయ్య బాబు మాట్లాడుతూ, ముందుగా అందరికీ నమస్కారాలు. నేను మీ బాలకృష్ణ ని. NTR కుమారుడిని. అందరూ బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. తెలుగు రాష్ట్రం బాగుండాలి అని తన తండ్రి NTR తెలుగుదేశం అని పార్టీ పెట్టి, ప్రజలకోసమే ప్రభుత్వం అని, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి వారిని ఆర్థికంగా, సామజికంగా అభివృద్ధి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆ తరువాత, ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడుస్తూ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తూ, మహిళా సాధికారత కోసం పొదుపు లక్ష్మి అనే పథకం ఏర్పాటు చేసి మహిళలను మహారాణులు గా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు.అలాగే మహిళలు కట్టెలపొయ్యి వాడుతుంటే పొగ వల్ల ఆరోగ్యం చెడిపోతుంది అని దీపం పథకం పెట్టి గ్యాస్ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అలాగే ఎస్సి, ఎస్ టీ, బీసీ, మైనారిటీ ల కోసం కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కి ఎంతగానో పాటుపడిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినతరువాత, అమరావతి లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణం చేపట్టి, పరిపాలన భవనాలను త్వరితగతిన నిర్మించి పరిపాలన అందించిన గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎన్నోపరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని,యువత కి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కొన్ని నెలలు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కానీ, డీఎస్ సి ద్వారా టీచర్ ఉద్యోగాలు కానీ, పోలీస్ ఉద్యోగాలు కానీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడే అన్నారు. కానీ మోసగాళ్ళకు మోసగాడు అయిన జగన్ ఒక్కచాన్స్ అంటూ ప్రజలను మోసం చేసి, తీరా ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి ని మరిచిపోయి,మైనింగ్,గ్రావెల్, ఇసుక, సిలికా ద్వారా అక్రమంగా లక్షలకోట్లు సంపాదించి దాచుకున్నాడు అన్నారు.5మంది రెడ్లు 5లక్షలకోట్లు సంపాదించారని, ఇది పేద బడుగు బలహీన వర్గాల కు చెందాల్సిన సొమ్ము అన్నారు. ఈయన అంబేద్కర్ విదేశీ విద్య లో అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టారు. ఈయన అంబేద్కర్ కంటే పెద్ద గొప్పవాడా ఈ పుడింగి అన్నారు. ఎస్సీ, ఎస్టి బీసీ మైనారిటీ కార్పొరేషన్లలోన్లు ఏమైపోయాయో తెలియదు,ఆరోగ్య శ్రీ సక్రమంగా పనిచేయదు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ప్రజలకు ఎటువంటి సహాయం లేదు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల రూపాయలు సహాయం కూడా మింగేసిన ఘనుడు ఈ జగన్ అన్నారు. నా ఎస్సీ నా ఎస్టి అంటూ, ప్రగల్బాలు పలికిన ఈ సైకో ఎంతో మంది దళితుల చంపేసినా, చివరికి తన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ని చంపేసి ఇంటికి డెలివరీ చేసినా కూడా కనీసం చలనం కూడా లేని రాక్షసుడు ఈ జగన్ అన్నారు. ఈ రాక్షస పాలన లో, ఉద్యోగులు, నిరుద్యోగులు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అల్లాడి పోతున్నారని, విసిగి వేసారి పోయారని అందుకే ప్రజలు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటున్నారన్నారు.చివరిగా అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అన్నా మన రాష్ట్రం లో NDA కూటమి అభ్యర్థులను అత్యధిక స్థానాలలో శాసన సభ్యులు గా గెలిపించుకోవాలని, అలాగే ప్రత్యేక హోదా రావాలన్నా, కేంద్రం నిధులు రావాలన్నా NDA కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటేనే అది సాధ్యం అవుతుంది అన్నారు. గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే అది టీడీపీ హయాంలోనే అని, గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి గా డాక్టర్ పాశం సునీల్ కుమార్ ను సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో, అలాగే తిరుపతి కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావ్ ని కమలం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని, అప్పుడే ఈ రాక్షసపాలన ను అంతమొందించవచ్చు అన్నారు. ఈ ఇద్దరిని గెలిపించుకుంటేనే గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కాబట్టి డాక్టర్ సునీల్ కుమార్ ని గూడూరు ఎమ్మెల్యే గా, డాక్టర్ వరప్రసాద్ రావు ని తిరుపతి ఎంపీ గా గెలిపించి, నరేంద్ర మోడీ కి, చంద్రబాబు నాయుడు కి, పవన్ కళ్యాణ్ కి కానుకగా ఇవ్వాలని తెలిపారు. వీరిద్దరి విజయానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి పనిచేసినప్పుడే విజయం సొంతమవుతుంది అన్నారు. ఈ సమావేశంలోతిరుపతి కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు,గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాశం సునీల్ కుమార్, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్, ఎన్నికలు పరిశీలకులు కరీముల్లా, బీజేపీ నియోజకవర్గం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, జనసేన నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావ్,పెంచలకోన దేవస్థాన మాజీచైర్మన్ తానంకి నానాజీ,టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాళ్లు లీలావతి, శ్రావణి రెడ్డి, అబ్దుల్ రహీమ్,బిల్లు చెంచురామయ్య యాదవ్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले