ప్రజాస్వామ్యానికి ఊపిరి వామపక్షాలే*

ప్రజాస్వామ్యానికి ఊపిరి వామపక్షాలే*

Share with
Views : 9
*ప్రజాస్వామ్యానికి ఊపిరి వామపక్షాలే* *ఇప్పుడు సాధారణ ఎన్నికల ముంగిట్లో వున్నాం.* *ఈ ఎన్నికల ప్రచార సరళిని చూస్తే చాలు!* *ప్రజల కోసం పని చేస్తున్నది ఎవరు? మతం కార్డుతో ప్రజల మధ్య చీలికలు తెచ్చి ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నది ఎవరు? అనేది అర్థమౌతుంది.* *ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, సమాఖ్య విధానానికి ప్రమాదం పొంచి వున్న నేటి పరిస్థితుల్లో సిపిఎంను, వామపక్షాలను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.* *2004 పార్లమెంటు ఎన్నికలలో బిజెపి పరాజయం పాలైంది.* *ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ తగిన మెజారిటీని పొందలేకపోయింది.* *61 మంది ఎంపీలతో వామపక్షాలు, 44 మంది ఎంపీలతో సిపిఎం పెద్ద శక్తిగా అవతరించింది.* *కనీస ఉమ్మడి కార్యక్రమం అమలుకు అంగీకరించేట్లయితే అనే షరతుతో ప్రభుత్వ ఏర్పాటుకు వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయి.* *అందుకు కాంగ్రెస్‌ అంగీకరించి డా. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది.* *ఆ విధంగా కనీస ఉమ్మడి కార్యక్రమం కారణంగా భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలు ప్రయోజనం పొందారు.* *మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) ఉద్యోగ హక్కు ప్రాథమిక హక్కులలో లేనప్పటికీ అమలులోకి వచ్చింది.* *కరోనా సమయంలో దేశం అకస్మాత్తుగా కఠినమైన లాక్‌డౌన్‌లోకి నెట్టబడినప్పుడు గ్రామీణ, వలస కార్మికులను ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కొంత వరకు కాపాడింది.* *ఈ రోజు కూడా గ్రామీణ పేదలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది.* *అదే సమయంలో సమాచార హక్కు చట్టం కూడా రూపొందించబడింది.* *ఫలితంగా వివిధ మంత్రిత్వ శాఖలతో సహా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని నేడు పొందగలుగుతున్నారు.* *విద్యా హక్కు చట్టం, జాతీయ ఆరోగ్య మిషన్‌, భూసేకరణ చట్టం కూడా కనీస ఉమ్మడి కార్యక్రమ ఫలాలే.* *అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కార్మికులలో 92 శాతం మంది వున్నారు.* *వారికి ఎటువంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు లేకుండా పనిచేస్తున్నారు.* *అసంఘటిత రంగ కార్మికుల కోసం డాక్టర్‌ అర్జున్‌సేన్‌ గుప్తా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యమైనది.* *అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులను విశ్లేషించిన ఆ కమిటీ జాతీయ సాంఘిక భద్రతా పథకానికి సిఫార్సు చేసింది.* *అలాగే జాతీయ స్థాయి కనీస వేతనం, అసంఘటిత రంగ కార్మికులకు జాతీయ నిధికి కూడా సిఫార్సు చేసింది.* *అంతేకాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలను కూడా ఆ కమిటీ నొక్కి చెప్పింది.* *రవాణా కార్మికుల విషయానికొస్తే, వారి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి తగిన సిఫారసుల కోసం వి.వి.గిరి నేషనల్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ప్రభుత్వం అప్పగించింది.* *అసంఘటిత రంగ రవాణా కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం చేయాలని వి.వి. గిరి నేషనల్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సిఫారసు చేసింది.* *ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినది.* *కానీ తరువాత రాజకీయ పరిస్థితు లలో వచ్చిన మార్పు కారణంగా ఆ సిఫారసు మరుగున పడింది.* *ప్రభుత్వ రంగ పరిశ్రమలను యథేచ్ఛగా విక్రయించడం, మూసివేయడానికి అడ్డుకట్ట వేయబడింది.* *ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోబడ్డాయి.* *పార్లమెంటులో వామపక్షాలు ఒక బలమైన శక్తిగా వుండడం వల్ల సమాజంలోని వివిధ వర్గాలు ప్రయోజనం పొందాయి.* *ఈ పదేళ్ల మోడీ పాలనలో ఇవన్నీ దాడికి గురవుతున్నాయి.* *సెక్యులరిజం, రాజ్యాంగం, అన్ని ఇతర సంస్థలు దాడికి గురవుతున్నాయి.* *ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకి కేటాయింపులు తగ్గాయి. పని దినాల సంఖ్య కూడా తగ్గింది.* *ఆర్‌టిఐ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు మొదలైనాయి.* *నూతన విద్యా విధానం (ఎన్‌.ఇ.పి) పేద వర్గాలను ఉన్నత చదువులకు దూరం చేస్తున్నది.* *26 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్‌ కోడ్లను ప్రభుత్వం తెచ్చింది.* *లేబర్‌ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులు బానిసత్వంలోకి నెట్టబడతారు.* *ప్రభుత్వ రంగ సంస్థలను నిర్దాక్షిణ్యంగా అమ్మివేయడం నేటి ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.* *”ప్రభుత్వ రంగం పుట్టింది చావడానికే”నని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా చెప్పారు.* *నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకం ద్వారా జాతీయ ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు.* *నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది.* *రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు.* *మొత్తంమీద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.* *కానీ శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది.* *వారి సంపద అనేక రెట్లు పెరిగింది.* *ఎలక్టోరల్‌ బాండ్ల సమస్యపై సుప్రీంకోర్టు తీర్పు దేశాన్ని కుదిపివేసింది.* *విస్మయపరిచే వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి.* *తన ప్రయోజనాల కోసం బిజెపి ఎలక్టోరల్‌ బాండ్లను ఏ విధంగా ఉపయోగించుకుందనే విషయమై అనేకానేక కథనాలు వస్తున్నాయి.* *ఇ.డి, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖల దాడులను ఎదుర్కొన్న కంపెనీలను ఎన్నికల బాండ్లు ఇచ్చిన తర్వాత విడిచిపెట్టారు.* *కొన్ని కంపెనీలు భారీ కాంట్రాక్టులు పొందాయి.* *అత్యంత ప్రమాదకరమైన మరొక విషయం ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు నకిలీ మందులను తయారు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి.* *ఆ కంపెనీలు ఎలక్టోరల్‌ బాండ్లను ఇచ్చాక వాటిపై కేసులను ముగించారన్న వార్తలు వచ్చాయి.* *కొందరు నిపుణులు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని చెప్పారు.* *వామపక్షాలు మాత్రమే ఎన్నికల బాండ్లను పార్లమెంట్‌లో వ్యతిరేకించాయి.* *ఎలక్టోరల్‌ బాండ్ల కింద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.* *ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఎం మాత్రమే.* *మతం పూర్తిగా వ్యక్తిగతమైనది.* *తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ భారత పౌరులకు వున్నది.* *మతం రాజ్యంలో జోక్యం చేసుకోకూడదు.* *రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.* *అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది?* *అన్ని రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.* *ఓట్లను సమీకరించే సాధనంగా మతాన్ని వాడుకుంటున్నారు.* *మైనారిటీ ప్రజలను బెదిరించి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు.* *వీటన్నిటి ఫలితంగా, ఇప్పుడు దేశం, ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు.* *ఈ తరుణంలో వామపక్షాలు పటిష్టంగా వుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.* *ప్రజలను, లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పార్లమెంటులో వామపక్షాలు ఒక బలమైన శక్తిగా రావాల్సిన అవసరం ఉంది.*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले