అడవిరాముడు కి 50 సంవత్సరాలు

అడవిరాముడు కి 50 సంవత్సరాలు

Share with
Views : 10
అది 1977 వ సంవత్సరం !! తెలుగు నేలని రెండు తుఫానులు తాకిన సంవత్సరం !! ఒకటి నవంబర్ 19 నాడు వచ్చి అతలాకుతలం చేసిన దివి తుఫాన్ !! దానికి ముందు ఏప్రిల్ 28 తెలుగు వెండితెరమీద తెలుగునేలని తాకిన వెండితెర మహాపురుషుడు నటించిన "అడవిరాముడు". 50 సంవత్సరాల చిత్రపరిశ్రమని అడవిరాముడికి ముందు తరవాత గా విభజించిన సంవత్సరం!! కేవలం 40 రోజులలో మధుమలై చిట్టడవుల్లో చిత్రీకరించబడి .. 32 కేంద్రాలలో విడుదల !!! 32 కేంద్రాలలో 100 రోజులు !! 16 కేంద్రాలలో 175 రోజులు !! 8 కేంద్రాలలో 200 రోజులు !! 4 కేంద్రాలలో 300 రోజులు !! ఒక కేంద్రం లో 365 రోజులు ప్రదర్శించబడినది !! ఒకపాట ప్రదర్శన సమయంలో అన్నగారు జయప్రదతో కలసి చేసిన డాన్స్ కి శివాలెత్తిన అభిమానులు విసిరిన చిల్లర విలువ ఇవాళ్టి లెక్క ప్రకారం కోటి రూపాయలపైనే!! నేడు చరిత్రలో అడవిరాముడు చిత్రం విడుదలైన రోజు !! అందుకే ఆయన యుగపురుషుడు !! మా దైవం !! జోహార్ యన్ టి ఆర్ !!
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले