జగనన్న పై షర్మిల రెడ్డి విమర్శల వర్షం

జగనన్న పై షర్మిల రెడ్డి విమర్శల వర్షం

Share with
Views : 13
జగనన్న పై షర్మిల రెడ్డి విమర్శల వర్షం *టెక్కలి :వైఎస్ షర్మిలా రెడ్డి* మాటల్లో - ఆఫ్ షోర్ రిజర్వాయర్ వైఎస్ఆర్ శంకుస్థాపన చేశాడు - 50 శాతం పనులు పూర్తి చేశాడు - మరణం తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది - జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చాడు - ఆఫ్ షోర్ పూర్తి చేసి 30 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తా అన్నారు - 5 ఏళ్లలో తట్టెడు మట్టి తీయలేదు - YSR కట్టలనుకున్న ప్రాజెక్ట్ కాబట్టి జగన్ పూర్తి చేయలేదు - వశాధర కాలువ ఆధునీకరణ అన్నాడు.. నిధులు ఇవ్వలేదు - టెక్కలి కి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు - ఇక్కడే కాదు..రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి - ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు - ప్రత్యేక హోదా అని మోసం చేశారు - గత 10 ఏళ్లుగా హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగేది - వేల సంఖ్యలో పరిశ్రమలు ..లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చి ఉండేవి - మన రాష్ట్రానికి కనీసం రాజధాని లేదు - బాబు అమరావతి అని బ్రమరావతి చేశాడు - మూడు రాజధానులు అని చెప్పి...ఒక్క రాజధాని లేకుండా చేశాడు జగన్ - YSR కి జగన్ కి పొంతనే లేదు - YSR రైతు పక్షపాతి - వైఎస్ఆర్ హయాంలో పంట నష్టపోతే రెండింతలు పరిహారం ఇచ్చాడు - జగన్ హయాంలో కనీసం పరిహారానికి దిక్కులేదు - రైతులకు గిట్టుబాటు ధర కూడా లేదు - ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడు - YSR కి బిడ్డలు అంటే ప్రాణం - ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు.. - పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చారు - జంబో డీఎస్సీ వేశాడు...జగన్ మాత్రం దగా డీఎస్సీ వేశాడు - ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశాడు - 2.35లక్షల ఉద్యోగాలు భర్తీ అని మోసం చేశాడు - 5 ఏళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారు - కుంభకర్ణుడి లెక్క జగన్ ఇన్నాళ్లు నిద్రపోయాడు - ఇప్పుడు లేచి ఉద్యోగాలు అంటూ నోటిఫికేషన్ లు ఇచ్చాడు - 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే...జగన్ నోటిఫికేశన్ ఇచ్చింది కేవలం 7 వేలకు మాత్రమే - YSR మాట మీద నిలబడే మనిషి - జగన్ మాత్రం మాట మీద నిలబడే వాడు కాదు - ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు - మాట తప్పం..మడమ తిప్పం అని చెప్పి మడమ తిప్పేశాదు - మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతున్నారు - మద్యం పేరిట మాఫీయా చేస్తున్నారు - మద్యం అమ్మకాల్లో దోపిడీ జరుగుతుంది - మద్యం అమ్మిన సొమ్ము ఎక్కడకు పోతుందో తెలియదు - చేసింది ఏమి లేదు కానీ....జగన్ గారు సిద్ధం అంటూ బయలు దేరారు - దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం - 20 లక్షల ఇళ్లు కడతామని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా ? - రాష్ట్రాన్ని మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పుల కుప్ప చేయడానికి సిద్ధమా ? - మద్య నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా ? - జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధమా ? - మళ్ళీ వస్తున్నారు..ఈ సారి పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్ లు పెడతారు. - ఆలోచన చేసి ఈ సారి ఓటు వేయండి - ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం - వైఎస్ఆర్ పాలన ప్రతి గడపకు చేరుస్తాం - 2లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ. - మహిళకు ప్రతి ఏడాది లక్ష వరకు సహాయం ..అంటే నెలకు 8330రూపాయలు ఇస్తాం - ఉపాధి హామీ పనికి 400 వేతనం - పక్కా ఇండ్లను మహిళ పెరుమీద 5 లక్షలతో కట్టించి ఇస్తాం. ఇదిలా ఉండగా - కిల్లి కృపారాణి నీ భారీ మెజారిటీ తో గెలిపించాలని , - ఎంపీగా పెడాడ పరమేశ్వర్ రావు ను గెలిపించాలని షర్మిల కోరారు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले