చెప్పిన పనులన్నీ చేసి శభాష్ అన్పించుకుంటా!*: నారా లోకేష్

చెప్పిన పనులన్నీ చేసి శభాష్ అన్పించుకుంటా!*: నారా లోకేష్

Share with
Views : 25
*చెప్పిన పనులన్నీ చేసి శభాష్ అన్పించుకుంటా!* *పేదరికం లేని మంగళగిరిని చూడాలన్నది నా లక్ష్యం!* *ఇళ్లు లేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి తాళాలిస్తా* *మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారాలోకేష్* మంగళగిరి: 2019లో ఓడిపోయినా మంగళగిరి నా సొంతమని భావించా, ప్రజలకు సేవచేసి వారి మనసులు గెలవాలని నిర్ణయించుకున్నా. 4.11 నెలల్లో సొంతడబ్బు ఖర్చుచేసి 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నకల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం గొడవర్రు, తాడేపల్లి, పెనుమాక రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. తొలుత గొడవర్రులోని మేరీమాత ఆలయం, చర్చిని సందర్శించారు. అనంతరం సమీపంలోని వీర్లపాలెం రామాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తెస్తూ వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజి, రోడ్లు , పొలాలకు డొంక రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. గొడవర్రు రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ... రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే కన్పించకుండా పోతే, నేను ప్రజలమధ్య ఉంటూ సేవచేశాను. పాతికేళ్లుగా మంగళగిరికి ప్రాతినిధ్యం వహించిన వారు నేను చేసిన సంక్షేమంలో పదోవంతైనా చేశారా? గుండెపై చేయివేసుకొని ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉంటనే ఇంత చేసిన వాడ్ని... అధికారమిస్తే ఎంత చేయగలనో మంగళగిరి ప్రజలు ఆలోచించాలి. పనిచేయాలనే కసి పట్టుదల నాలో ఉన్నాయి. పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం, ఇప్పటికంటే రెట్టింపు కష్టపడి మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది. శాసనసభ్యునిగా ఎన్నికయ్యాక మీ అందరితో శభాష్ అన్పించుకునేలా చెప్పిన పనులన్నీ చేస్తా. కోవిద్ తర్వాత ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నా. నిమ్మకూరును ఆదర్శంగా తీసుకొని భూగర్భ డ్రైనేజి ఏర్పాటుచేస్తా. కృష్ణానది నీటిని శుద్ధిచేసి సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందిస్తా. తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా సిసి రోడ్ల నిర్మాణం చేపడతా. బిసి సోదరులకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని లోకేష్ చెప్పారు. మీ ఇంటిబిడ్డలా భావించి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. *కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ జగన్!* బటన్ నొక్కుడు పేరుతో 10రూపాయలు ఇచ్చి వంద కొట్టేయడంలో జగన్ మాస్టర్స్ డిగ్రీ చేశారు. అందుకే ఆయన కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్. కరెంటు ఛార్జీలు 9సార్లు, ఆర్టీసి ఛార్జీలు 3సార్లు పెంచి ప్రజల నడ్డివిరిచాడు. ఇంటిపన్ను, చెత్తపన్ను, నిత్యావసర వస్తువుల ధరలు... ఇలా అన్ని విధాలుగా ప్రజలపై భారం మోపాడు. జగన్ పాలనలో దెబ్బతిన్న పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు బాబు సూపర్-6 పథకాలను ప్రకటించాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. లక్షలు ఖర్చుచేసి ఉన్నత చదువులు చదివిన మన బిడ్డలు ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడం విచారకరం. మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి స్థానికంగానే వారికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. 20లక్షల ఉద్యోగాల కల్పనతో రాష్ట్ర ఆదాయం రెండున్నర రెట్లు పెరుగుతుంది. ఆ డబ్బుతో ఇప్పటికంటే మెరుగైన సంక్షేమం అందించడ రోడ్లు, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి 10కి.మీ.ల ప్రయాణానికి కూడా హెలీకాప్టర్ ఉపయోగిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మూలధన వ్యయాన్ని పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. *యువనేత దృష్టికి గొడవర్రు గ్రామ సమస్యలు* గొడవర్రు గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. పార్టీ, కుల, మతాల పేరుతో వివక్ష చూపిస్తూ వాస్తవ లబ్ధిదారులకు జగన్ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేనివారందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయండి. పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న అరకొర వేతనాన్ని నాలుగునెలల కోసారి ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. కుంటిసాకులతో పెన్షన్, రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు. గ్రామంలో పశువుల ఆసుపత్రి ఏర్పాటుచేయాలి. శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించాలి. నాడు-నేడు పేరుతో స్కూళ్లకు రంగులు వేశారు కానీ టీచర్లను నియమించలేదని చెప్పారు. నారా లోకేష్ స్పందిస్తూ... నియోజకవర్గంలో ఇళ్లు లేనివారికి 20వేల ఇళ్లు నిర్మించి తాళాలు అందిస్తా. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు అందజేస్తాం. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా జీతం, సంక్షేమ పథకాలు అందిస్తాం. గోపాలమిత్రల ద్వారా పశువైద్య సేవలు అందిస్తాం. *అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం* తాడేపల్లి పురం సెంటర్ లో నిర్వహించిన రచ్చబండ సభలో స్థానికులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి. మంగళగిరికి ఐటి కంపెనీలు రప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలి. పాలిటెక్నిక్ చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి. దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలివ్వాలని కోరారు. యువనేత లోకేష్ స్పందిస్తూ... అగ్రిగోల్డ్ సంస్థ రికార్డులను సరిగా నిర్వహించలేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ సంస్థ బాధితులు ఉన్నారు. ప్రస్తుతం ఆయా అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ వేసి, డిపాజిట్ దారులకు న్యాయం చేస్తాం. మంగళగిరికి ఐటి కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తాం. గతంలో మాదిరిగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ ఇస్తాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తాం. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ******
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले