టీడీపీ, జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం: బీజేపీ ప్రకటన*

టీడీపీ, జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం: బీజేపీ ప్రకటన*

Share with
Views : 13
*అమరావతి*:*టీడీపీ, జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం: బీజేపీ ప్రకటన* *ప్రజాగళం పేరిట ఉమ్మడి మేనిఫెస్టో విడుదల* *మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ ఫొటోలు* *మోదీ ఫొటో లేకపోవడంపై అధికార వైసీపీ వ్యంగ్యాస్త్రాలు* *మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని తెలియజేసిన ఏపీ బీజేపీ* ఇవాళ ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో పేరిట చంద్రబాబు, పవన్ కల్యాణ్ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండగా, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో అధికార వైసీపీ దెప్పి పొడుస్తోంది. ఇది మాయా కూటమి అని అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా, కూటమికి ఒక సభ్యుడు దూరం జరిగాడంటూ వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నేడు విడుదల చేసిన మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని బీజేపీ స్పష్టంగా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో-2024ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले