టీడిపీ నేతలే హత్య చేసినట్లు ఆరోపణలు చేశారు - టీడీపీ నేతలు హత్య చేస్తే మీ ప్రభుత్వం హయాంలో ఎందుకు పట్టుకోలేదు: సునీత

టీడిపీ నేతలే హత్య చేసినట్లు ఆరోపణలు చేశారు - టీడీపీ నేతలు హత్య చేస్తే మీ ప్రభుత్వం హయాంలో ఎందుకు పట్టుకోలేదు: సునీత

Share with
Views : 7
పులివెందుల: వైఎస్ వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశం : తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివిటీ బయట పెట్టిన సునీత - వివేకానందరెడ్డి హత్యపై ప్రజెంటేషన్ ఇచ్చిన సునీత - ఇదే అంశంపై అజేయ కల్లం సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చారు - ఆ తరువాత తాను స్టేట్ మెంట్ ఇవ్వలేదని చెప్పారు - 5 గంటలకు జగన్ ఇంట్లో మీటింగ్ జరుగుతోంది - అదే సమయంలో జగన్‍ను భారతి పిలిచారు - ఆ తర్వాత జగన్ బయటకు వచ్చి చిన్నాన్న చనిపోయారని చెప్పారు - ఎందుకు ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదో తెలియట్లేదు - అవినాస్ రెడ్డికి అదే రోజు ఉదయం 6.26 గంటలకు ఫోన్ వచ్చింది - ఉదయం 6.27 గంటలకు అవినాష్ రెడ్డి ఇంటి ప్రాంగణంలో ఉన్నారు - వివేకా ఇంటి బయట అవినాష్ రెడ్డి ఫోన్‍లో మాట్లాడారు - అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చినప్పుడు దాదాపు 10-15 మంది ఉన్నారు - తాను వచ్చేసరికి 50-100 మంది ఉన్నట్లు అవినాష్ పోలీసులకు చెప్పారు - ఉదయం 6.32 గంటలకు భారతి సహాయకుడు నవీన్‍తో అవినాష్ మాట్లాడారు - అవినాష్ రెడ్డి ఆరు నిమిషాలపాటు ఏం చెప్పారో తెలియట్లేదు - ఓఎస్ డీ కృష్ణమోహన్, శివప్రకాశ్ రెడ్డితోకూడా అవినాష్ రెడ్డి మాట్లాడారు - ఉదయం 7 గంటల నుంచి 8 ప్రాంతంలో హత్య స్థలంలో క్లీన్ చేశారు - ఇంత సేపు ఫోన్ లో మాట్లాడిన తర్వాత సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది? - ఫిర్యాదు ఇచ్చిన తర్వాత చేసిన ఫోన్‍కాల్స్ లో ఏం మాట్లాడారు -మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని ప్రచూరించారు - ఇప్పుడేమో నేను, మా వాళ్లు హత్య చేశామని చెబుతున్నారు -ఘతన తర్వాత వారిని, మమ్మల్ని కాని ఎందుకు అరెస్టు చేయలేదు -మేము ఇద్దం కాకుండా మరెవరో అయితే ఎందుకు అరెస్టు చేయలేదు - 2019 మార్చి 15న ఏడీజీపీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు - 2019 జూన్ 13న ఎస్పీ అభిషేక్ నేతృత్వంలో రెండో సిట్ ఏర్పాటు చేశారు - 2019 అక్టోబర్ 16న ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో మూడో సిట్ ఏర్పాటు - తొలి సిట్ వేళ ఇన్‍స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు.. ఒకరిని అరెస్టు చేశారు - రెండో సిట్ సమయంలో చార్జ్ షీట్ దాఖలు చేయలేదు - అనుమానాస్పద స్థితిలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు - శనగ గుళికలు తీసుకుని శ్రీనివాస్ రెడ్డి చనిపోయినట్లు చెప్పారు - సీఎం, భాస్కర్ రెడ్డి, శివప్రకాశ్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు - తన చావుకు ఇన్‍స్పెక్టర్ శ్రీరామ్ కారణమని లేఖలో శ్రీనివాస్ రెడ్డి రాశాడు - శ్రీనివాస్ రెడ్డి రాసిన రెండు లేఖల్లో చేతిరాత వేర్వేరుగా ఉంది - వివేకా హత్య కేసును ఇన్ స్పెక్టర్ శ్రీరామ్ దర్యాప్తు చేశారు - శ్రీనివాస్ రెడ్డి మృతి కేసు దర్యాప్తు మాత్రం పక్కన పడింది - శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య లేఖలను ఫోరెన్సిక్ ల్యాబ్‍కు పంపారు - మాజీ సీఎస్ అజేయ కల్లం సీబీఐకి స్టేట్‍మెంట్ ఇవ్వలేదని కేసు పెట్టారు -కేసుకు సంబంధించి కోర్టులో సీబీఐ ఆడియో రికార్డింగ్ సమర్పించింది - సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని 2020 ఫిబ్రవరిలో జగన్ హైకోర్టులో మెమో దాఖలు చేశారు - జగన్‍కు నైతిక బాధ్యత ఉందని కోర్టు చెప్పింది - చంపింది ఎవరో త్వరగా కనుక్కోవాలని కోర్టు చెప్పింది - దర్యాప్తునకు ఢోకా లేదని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశారు - 2021లో నవంబర్‍లో శివశంకర్ రెడ్డి అరెస్టు జరిగింది - టీడిపీ నేతలే హత్య చేసినట్లు ఆరోపణలు చేశారు - టీడీపీ నేతలు హత్య చేస్తే మీ ప్రభుత్వం హయాంలో ఎందుకు పట్టుకోలేదు - నేను సీబీఐని ఆశ్రయించకముందు నేరస్థులను ఎందుకు పట్టుకోలేదు - ఇప్పుడేమో మేము నేరం చేశామని చెబుతున్నారు - ప్రజలు ఆలోచించి న్యాయం కోసం ఓటు వేయాలి కోరుకుంటున్నా : వైఎస్ సునీత
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले