గాజు గ్లాసు గుర్తుపై గూడు పుతాని

గాజు గ్లాసు గుర్తుపై గూడు పుతాని

Share with
Views : 9
జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ పోటీ చేయని అన్ని స్థానాల్లోనూ ఇండిపెండెంట్లకు గుర్తులు అందుబాటులో ఉంచాలి. కానీ ఏపీలో ఏం జరిగిందో ఎవరికీ తెలియడం లేదు. పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ అందుబాటులో ఉంచారు. టీడీపీ, జనసేన రెబల్స్ కు కేటాయించారు. మిగిలిన చోట్ల మాత్రం గాజు గ్లాస్ ఎవరికీ ఇవ్వలేదు.. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ గాజు గ్లాస్ కేటాయించారు. ఇలా ఎందుకు జరిగింది ?. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేశారు. ఢిల్లీ వెళ్లి ఎన్డీఏ కూటమి నేతలు ప్రత్యేకంగా ఈసీని విజ్ఞానప పత్రం ఇచ్చారు. ఇండిపెండెంట్లకు ఇవ్వకుండా ఉత్తర్వులు వచ్చాయన్న ప్రచారం జరిగింది. కానీ కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు తమకేమీ ఉత్తర్వులు రాలేదని చెప్పి కేటాయించేశారు. ఇంత గందరగోళం మధ్య జరుగుతున్న ఎన్నికలకు ఎవరు బాధ్యత వహిస్తారు ?. ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణ నిజాయితీ ఉందని ఎవరూ చెప్పలేని పరిస్థితి. సామాన్య జనానికి డౌట్లు వచ్చే ఎన్నో అంశాలు బహిరంగంగా జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న సమయంలో బీజేపీ వచ్చి కూటమితో కలిసింది. బీజేపీ నుంచి కొంత సహకారాన్ని ఆ రెండు పార్టీలు ఖచ్చితంగా కోరుకుంటాయి. కానీ అలాంటి సహకారం ఇప్పటి వరకూ అందలేదని స్పష్టంగా చెప్పవచ్చు. సహకారం అంటే.. నిబంధనలకు అనుగుణంగా పని చేసేలా అధికార యంత్రాంగాన్ని అందుపులో ఉండేలా కట్టడి చేయడమే. కానీ అది కూడా జరగడం లేదని జరుగుతున్న పరిణామాలతో అంచనా వేయవచ్చు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले