రైతు సంక్షేమం,బలహీన వర్గాల అభివృద్దే టిడిపి మేనిఫెస్టో

రైతు సంక్షేమం,బలహీన వర్గాల అభివృద్దే టిడిపి మేనిఫెస్టో

Share with
Views : 7
*రైతు సంక్షేమం,బలహీన వర్గాల అభివృద్దే టిడిపి మేనిఫెస్టో ..... మామిడాడ, ఇర్రిపాక గ్రామాలలో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారంలో జ్యోతుల నెహ్రూ* కాకినాడ జిల్లా జగ్గంపేట మే 1: టిడిపి, జనసేన, బి జె పి ఉమ్మడి ప్రభుత్వం అధికారం లోకి రాగానే రైతుల సంక్షేమం అభివృద్ధి, బలహీన వర్గాల అభివృద్దె ఎజెండాగాటిడిపి మేనిఫెస్టో రూపొందించబడిందని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం మామిడాడ , ఇర్రిపాక గ్రామాలలో వందలాదిమంది జన నిరాజనాలతో మహిళల మంగళహారతులతో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్బంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టిడిపి మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని అన్నారు. ఈ నెల కూడా పెన్షన్ దారులకు ఇబ్బందులకు గురిచేసి బ్యాంక్ అకౌంట్ అంటూ అవ్వతాతలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు అవ్వ తాతలకు పెంచిన పెన్షన్ఏప్రిల్ నెల నుండి 1000 రూపాయలు పెంచి ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జులై నెలలో ఈ మూడు నెలల 3000, జూలై నెలలో పెంచిన 4000 కలిపి 7000 ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని నెహ్రూ అన్నారు. తెలుగుదేశం పార్టీ అవిర్బావం నుండి బి సి లు అండగా ఉన్నారని బి సి ల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం తోనే సాధ్యం అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం బి సి కార్పొరేషన్ లను నిర్వీర్యం చేసిందని అన్నారు. 56 కార్పొరేషన్ ల పేరుతో బలహీన వర్గాల వారిని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ని నమ్మొద్దు అన్నారు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ పెంచారని దివ్యాంగులకు 6000 రూపాయలు పెంచారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, బస్వా చిన్న బాబు, జ్యోతుల సత్యమూర్తి, జ్యోతుల ఏసుబాబు, పెంటకోట సత్యనారాయణ, వేగి రామకృష్ణ, దేశెట్టి శ్రీనివాస్, దాడి వెంకటేశ్వరరావు, బొడ్డేటి సుమన్, మద్దాల దుర్గ బాబు, అల్లు రామరాజు, మామిడాడ, ఇర్రి పాక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले