కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో గోండు శంకర్ ప్రశ్న

కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో గోండు శంకర్ ప్రశ్న

Share with
Views : 18
శ్రీకాకుళం:కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ధర్మాన సమాధానం చెప్పాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంను బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ఎంతో మంది జాతీయస్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిదిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా వున్న ధర్మాన ఎన్నికల ముందు పనుల జాప్యం పై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. నిజంగా ధర్మానకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే అయిదేళ్లలో ఎందుకు పూర్తిచేయలేదో చెప్పాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఇటు స్టేడియం, అటు ఆమదాలవలస రోడ్ నిర్మాణం పూర్తి చేయలేని అసమర్ధ నాయకులు ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రజలను నమ్మబలుకుతున్నారని ఆరోపించారు. రివర్స్ టెండర్ల పేరిట రాష్ట్రాన్ని 20ఏళ్ళు వెనక్కు నెట్టేసారని మండిపడ్డారు. ఇప్పటికే అప్పుల ఊబిలో రాష్ట్రం చిక్కుకుపోయిందని, పేదలు మరింత పేదలుగా మారిపోయారని ఇటువంటి పరిస్థితుల్లో మరోమారు వైకాపా నేతల ప్రలోబాలకు గురైతే రాష్ట్రం కనుమరుగు అవుతుందని, ప్రజల బతుకులు మరింత దుర్బరంగా మారుతాయని చెప్పారు. మళ్ళీ బాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని బతికించుకుని అభివృద్ధి చేసుకోగలమని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పూర్తి చేసి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. అదేవిధంగా ఆమదాలవలస రోడ్డును పూర్తి చేస్తామని, నగరంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले