ఇవ్వాళ్టి కి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయి: వైయస్ షర్మిల

ఇవ్వాళ్టి కి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయి: వైయస్ షర్మిల

Share with
Views : 7
కడప : వైయస్క షర్మిల , జగన్పై ప్రశ్నల వర్షం కురిపించారు. కడప ఎంపీగా అనాడు YSR కూడా పని చేశాడు - వైఎస్ వివేకా సైతం ఎంపీగా గెలిచాడు - ఇప్పుడు YSR బిడ్డ కూడా కడప ఎంపీగా పోటీ చేస్తుంది - వైఎస్ వివేకా ను హత్య చేయించిన వ్యక్తి అవినాష్ రెడ్డి - హత్య జరిగినప్పుడు మాక్కూడా ఈ విషయం తెలియదు - CBI ఆధారాలు చూపించిన తర్వాత నమ్మాల్సి వచ్చింది - అన్ని ఆధారాలు అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని చెప్తున్నాయి - 40కోట్ల డీల్ మాట్లాడి హత్యకు ప్లాన్ చేశారు - మొబైల్ రికార్డ్స్,గూగుల్ లోకేషన్ లు అన్ని అవినాష్ వైపు చూపించాయి - అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు - అవినాష్ రెడ్డికి అరెస్ట్ కాకుండా కర్ఫ్యూ సృష్టించారు - CBI కి సహకరించకుండా అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా చూశారు - ఇది అన్యాయం,అధర్మం - నేను YSR బిడ్డ..పులి బిడ్డ - నా గుండెలో దమ్ముంది - న్యాయం కోసమే ఎంపీగా పోటీ చేస్తున్న - మళ్ళీ నిందితుడికి ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయం - అన్యాయాన్ని ఎదురించడానికే పోటీ - మీరు న్యాయం వైపు ఉంటారా ? అన్యాయం వైపు ఉంటారా ? - కడప గడ్డ ప్రజలు ఆలోచన చేయాలి. - నేను పుట్టింది ఇక్కడే...ఇది నా గడ్డ - ఇక్కడే ఉంట..ప్రజలు సేవ చేస్తా - కడప ఎంపీ గా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతా - ప్రత్యేక హోదా సాదించుకొని వస్తా - జగన్ YSR వారసుడు ఎలా అవుతాడు ? - ఆయన ఆశయాలను ఒక్కటి అమలు చేశాడా ? - YSR కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడు - YSR హయాంలో వ్యవసాయం పండుగ - నేడు రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎక్కడ లేడు - పంట నష్టపరిహారం అని మోసం చేశాడు - ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడు - నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశాడు - 2.35లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు.. - అధికారం అనుభవించి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు - ఇవ్వాళ్టి కి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయి
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले