భీమేశ్వర రెడ్డి స్థానం లో స్వరూప రెడ్డి చూస్తున్న: అచ్చెన్నాయుడు

భీమేశ్వర రెడ్డి స్థానం లో స్వరూప రెడ్డి చూస్తున్న: అచ్చెన్నాయుడు

Share with
Views : 19
కోటబొమ్మాళి: నౌపడలో తెదేపా కు పూర్వ వైభవం వచ్చిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో తెదేపా యువ నాయకులు *సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి* ఆధ్వర్యంలో నౌపడ తెదేపా నాయకులు, కార్యకర్తలు, యువత తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత సుగ్గు భీమేశ్వరరావు ఉన్నప్పుడు పార్టీ ఓట్లు ఒక వైపే పడేవని, మళ్లీ ఎప్పుడు ఆయన మనవడు సుగ్గు స్వరూప రెడ్డి వచ్చినప్పుడు నుంచి యువత అంతా ఆయనతో కదులుతున్నారని,‌ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. టెక్కలి-నౌపడ, కోటబొమ్మాలి-నౌపడ రెండు వరుసల రహదారి నిర్మాణం గతంలో చేపట్టామని, త్వరలో తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నౌపడ-వెంకటాపురం రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. నౌపడ గ్రామ అభివృద్ధి కు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న పది రోజులు యువత నిరంతరం పార్టీ కోసం కష్టపడి పని చేసి, అత్యధిక మెజారిటీ అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నౌపడ గ్రామ కమిటీ అధ్యక్షుడు మహంతి రాజు, పలువురు సినీయర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले