ఆయన ఒక్కడే

ఆయన ఒక్కడే

Share with
Views : 12
టీ .ఎన్.శేషన్ అతనొక్కడే.. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం ఎంత పవర్ ఫుల్లో ఆయన చూపించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఏమిటో ఆయన ప్రజల ముందుంటారు. ఎన్నికలు ఎలా నిర్వహిస్తే ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉంటాయో ఆయన ఉదాహరణలు వదిలి వెళ్లారు. 1990-96 మధ్య ఆయన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు. అసలైన ప్రజాస్వామ్యాన్ని దేశం చూసిన సమయం ఇది. మళ్లీ ఇప్పటి వరకూ ఆయన లాంటి అధికారి రాలేదు. ప్రతీ సారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు .. ప్చ్ మరో శేషన్ ఇక రారా అని నిట్టూర్చడం కామన్ అయిపోయింది. ఈ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో అది మరింత సహజం అయిపోయింది. ఎన్నికల సంఘం ఉనికిలో ఉందా ? దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తున్నారు అంటే… ఇంకెవరు భారతీయ జనతా పార్టీనే అన్న సమాధానం నలువైపుల నుంచి వస్తుంది. దేశంలో ఎన్నికల ప్రక్రియ అపహస్యం అవుతోంది. ఓ వైపు ప్రధాని మోదీ నేరుగా ముస్లింల పేరు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. రాముడి ఫోటో వాడుకోని బీజేపీ నేత లేరు. దురుసు వ్యాఖ్యలు చేయని రాజకీయ నేత లేరు. తెలుగురాష్ట్రాల్లో అయితే గీత దాటిపోయారు. ఏపీలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. పాలనా యంత్రాంగాన్ని గుప్పిటపట్టుకున్న కొంత మంది ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నా పట్టించుకోడవం లేదు. కానీ నెల రోజుల కిందట మాట్లాడారంటూ కేసీఆర్ ప్రచారంపై ఇప్పుడు రెండు రోజుల బ్యాన్ వేశారు. ఆయనొక్కడే కనిపించారా అని ప్రజలంతా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. కళ్ల ముందు కనిపిస్తున్న ఉల్లంఘనల సంగతేమిటని అందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఎన్నికల సంఘం ఇంత పవర్ లెస్ గా ఎందుకు అయింది ? . ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ఓ ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే మిగిలారు. అప్పటికప్పుడు కేంద్రం ఇద్దర్ని నామినేట్ చేసింది. ఎవరు వాళ్లు ?. కేంద్ర పెద్దలు చెప్పిన మాటని జవదాటని పెద్ద మనిషులు. ఇప్పటికే ఉన్న పెద్ద మనిషి దాటుతారా అంటే.. దానికి అవకాశమే లేదనుకోవాలి. అదే మన ప్రజాస్వామ్యం. కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ పవర్ ఫుల్ – ప్రధాని కూడా కోడ్ పరిధిలోకి ! ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా విశ్వసనీయతతో నిర్వహిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ రూపొందించినా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా ఓటర్ల జాబితా రూపొందించినా ఆ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎన్నికల కమిషన్ కూడా అంతే. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం అదుపులో ఉంటుంది. ఎన్నికలు స్వేచ్చగా జరగడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ ప్రతీ సందర్భంలోనూ మనం చెప్పుకుంటున్న పవర్ ఫుల్ రాజ్యాంగ వ్యవస్థకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారన్నదే అక్కడ కీలకం. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించి దేశానికి తనదైన సేవ చేయాలనుకునే శేషన్ లాంటి అధికారుల వల్ల ఆ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయో ప్రజల ముందు సాక్షాత్కరిస్తాయి. అంపైర్లు పక్షపాతంగా ఉండి మ్యాచ్ ను గెలిపించే పరిస్థితి వస్తే అలాంటి గేములు ఆడించకుండా… విజేతను ప్రకటించడం ఉత్తమం. ఇది ఎన్నికలకు అయినా వర్తిస్తుంది. ఎన్నికలు ఎంత పారదర్శకంగా ప్రజలు ఎంత గొప్పగా నమ్మేలా జరుగితే అంత గొప్పగా డెమెక్రసీ బలోపోతం అవుతుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఇటీవలి కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎన్నికల సంఘానికే ప్రకటించాల్సి వస్తోంది. అది ప్రమాదకరణ ధోరణి. నియామక ప్రక్రియలోనే లోపం – సుప్రీంకోర్టు చెప్పినా చేయాలనుకున్నదే చేసిన కేంద్రం ! సుప్రీంకోర్టు ఇప్పుడు ఈసీ నియామక తీరులో మార్పులు చేస్తూ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఎన్నికల సంఘంలో ఏకపక్ష నియామకాలు జరగకుండా ఒక నియామక ప్రక్రియ నిర్దేశించాలని కోరుతూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ తరపున 2022లో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీన్ని త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న సమయంలోనే అరుణ్‌ గోయల్‌ అనే కార్యదర్శిని స్వచ్ఛంద పదవీ విరమణ చేయించి ఎన్నికల కమిషనర్ గా నియమించారు. జస్టిస్‌ జోసఫ్‌ ధర్మాసనం దీనిపై స్పందించి ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఈ మేరకు పార్లమెంట్ చట్టం చేయాలని తీర్పు ఇచ్చారు. కాగ్‌ వంటి వాటితో పోలిస్తే ఎన్నికల సంఘం అత్యంత ముఖ్యం గనకే అందుకు ప్రత్యేక నియామక పద్ధతిని రాజ్యాంగం చెప్పిందని.., ఇందుకు స్వతంత్రత అనేది కొలబద్ద అని సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది. సీఈసీ రాజకీయ వ్యవస్థకు లోబడి వుండకూడదనేది కీలకసూత్రం. పార్లమెంటు చట్టం చేసేలోగా కూడా స్వతంత్రత కాపాడేందుకు గాను ప్రధాని ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ రాష్ట్రపతికి సూచనను చేయాలని నిర్దేశించారు. ఇక్కడే కేంద్రం అడ్వాంటేజ్ తీసుకుంది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామక షరతులు, సర్వీసు పదవీ నిబంధనలు) బిల్లు 2023 పేరిట వచ్చిన ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్‌ 12న ఆమోదించింది. ప్రధాన మంత్రి అధ్యక్షులుగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నియమించే మరో కేంద్రమంత్రి సభ్యులుగా కమిటీ ఈ ఎంపిక కోసం రాష్ట్రపతికి పేరు సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే కార్యదర్శులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారే ఈ పదవికి అర్హులుగా వుంటారు. అంటే నియమించే కమిటీలో ప్రధాని మాట అమలవుతుంది. రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టం చేశారని పిటిషన్లు దాఖలైనా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు కేంద్రం నియమించిన వారే ఎన్నికల కమిషనర్లుగా ఉన్నారు. శేషన్ లాంటి సీఈసీ మళ్లీ ఎందుకు రాలేదు.. ఇక రారా ? “శేషన్” లాంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మళ్లీ ఎందుకు రాలేదు అని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆయన స్థాయిలో మళ్లీ ఎన్నికల సంఘాన్ని నడిపించిన వారు లేరు. ఎన్నికల సంఘం అంటే ఎన్నికల నిర్వహణ సమయంలో సుప్రీం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి దేశానికి అచ్చమైన ప్రజా ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేలా చూడటమే కాకుండా నిరంతరం నిష్పక్షిపాతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఎన్నికలు జరిగే తీరు శేషన్‌కు తర్వాత అన్నంతగా ఎన్నికల నిర్వహణలో మార్పులు చేస్తూ అప్పట్లో హుకూం జారీ చేసి పోటీల్లో నిలిచే అభ్యర్థుల పట్ల సింహస్వప్నంలా మారి నిబంధనల కొరడా ఝుళిపించారు. శేషన్ తన పదవీకాలంలో ప్రధాన మంత్రి నరసింహారావు నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అహ్మద్, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వరకూ ఎవరినీ వదల్లేదు. ఆయన బిహార్‌లో మొదటిసారి నాలుగు దశల్లో ఎన్నికలు జరిగేలా చేశారు. ఆ నాలుగుసార్లూ ఎన్నికల తేదీలు మార్చారు. బిహార్ చరిత్రలోనే అవి సుదీర్ఘ ఎన్నికలుగా నిలిచాయి. ఎన్నికల కమిషన్‌ను సెంటర్ స్టేజ్ పైకి తీసుకురావడంలో శేషన్ చాలా కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి ఊరూపేరూ లేకుండా ఉండేది. కానీ శేషన్ ఆ పదవి పవర్‌ను బయటకు తీసుకు వచ్చారు. ఒక్క సారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత దేశ వ్యవస్థ మొత్తం ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్తుంది. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. ఆ పదవిలో అంత పవర్ ఉందని శేషన్ చూపించారు. కానీ ఇతరులు మాత్రం చూపించలేకపోతున్నారు. ప్రజాస్వామ్యానికి శేషన్లు అవసరం ! ఎన్నికల కమిషనర్ల నియామకమే ఏకపక్షంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వమే నియమిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ముందే ఇద్దరు కమిషనర్లను నియమించారు. వారు ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్నది సందేహమే. అసలు ప్రభుత్వాల అధికార దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని రాజకీయవర్గాలు ఊహించలేవు. ఎన్నికల సంఘం ఎప్పుడు వంద శాతం పర్ ఫెక్ట్ గా వ్యవహరిస్తుందో అప్పుడే ప్రజాస్వామ్య పునాదులు మరితం బలోపేతం అవుతాయి. కనుచూపు మేరలో ఇలాంటి అవకాశం ఉంటుందని కనిపించడం లేదు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले