ఏపీలో ఎన్డీఏ కూటమి స్వీప్ చేయబోతోందని స్పష్టం: అమిత్షా

ఏపీలో ఎన్డీఏ కూటమి స్వీప్ చేయబోతోందని స్పష్టం: అమిత్షా

Share with
Views : 9
ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో పాటు సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గూండాగిరి, అవినీతి, భూదోపిడీ అరికట్టటానికి ఈ పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి స్వీప్ చేయబోతోందని స్పష్టం చేశారు. తెలుగు భాషను అంతం చేయడానికి కుట్ర పన్నారని .. తాము ఉన్నంత వరకూ తెలుగుభాషను కాపాడతామని.. జగన్ రెడ్డీ గుర్తు పెట్టుకో అని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి కారణంగా పోలవరం ప్రాజెక్టు పడకేసిందని తాము రాగానే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హ ామీ ఇచ్చారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో అభివృద్ధి జరిగింది.. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. ఏపీ అభివృద్ధి ఆగిపోయింది.. 13 లక్షల 50 వేల కోట్ల అప్పును ఏపీపై జగన్‌ రుద్దారు.. మద్యనిషేధం హామీ ఇచ్చి.. మద్యం సిండికేట్‌ను జగన్‌ ప్రోత్సహించారని మండిపడ్డారు. చంద్రబాబు, మోదీ గెలిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీపూర్తి చేస్తామన్నారు. ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మూడింట రెండు వందల మెజార్టీ చంద్రబాబుకు ఇవ్వాలన్నారు. బీజేపీ పెద్దలు వచ్చినా తమను విమర్శించరని.. తాము సహజ మిత్రులమని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్న వైసీపీ నేతలకు అమిత్ షా ప్రసంగాలు గట్టి షాక్ ఇచ్చాయనుకోవచ్చు. నేరుగా జగన్ పేరు పెట్టి ఆయన హెచ్చరికలు జారీ చేశారు వివిధ జాతీయ మీడియాలకు ఇస్తున్న ఇంటర్యూల్లో బీజేపీ వైపే ఉంటాయనన్నట్లుగా జగన్ రెడ్డి చెబుతున్నా.. లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇది వైసీపీ నేతలకు మింగుడు పడని అంశమే. అరు, ఎనిమిది తేదీల్లో ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు. ఆయన కూడా ఇదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తే… విదిరించుకుంటున్నా కాళ్ల పట్టుకుటుంటున్న బాపతలో వైసీపీ పడిపోయినట్లవుతుంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले