సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా* *వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోనీ*

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా* *వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోనీ*

Share with
Views : 11
శ్రీకాకుళం :సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోనీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ సందర్శించారు. ఎంసీసీ నోడల్‌ అధికారులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, షేర్‌చాట్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వివిధ రకాల విషయాలపై పోస్టులు చేస్తుంటారని, అందులో ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలను గుర్తించాలని సూచించారు. ఎన్నికల క్యాంపియన్‌లో భాగంగా అభ్యర్థులు సోషల్‌ మీడియా ద్వారా వీడియోలు, ఫొటోలు, వాయి్‌సరికార్డు, మెసేజ్‌లు, పోస్టర్లు పాంప్లెంట్ల ద్వారా ప్రచారం చేసుకుంటారని అన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले