సైకిలు గుర్తుకి ఓటెయ్యండి: కింజరాపు శ్రావ్య

సైకిలు గుర్తుకి ఓటెయ్యండి: కింజరాపు శ్రావ్య

Share with
Views : 19
ఎన్దియే హాయంలో చంద్రబాబు సారథ్యంలో నగరాభివృద్ధి జరగనుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రీ శ్రావ్య, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మరదలు డాక్టర్ హరిత పేర్కొన్నారు. నగరంలోని కృష్ణా పార్క్ పరిసర ప్రాంతాల్లో కెల్ల కొండలరావు, కెల్ల కిషోర్ కుమార్ (చిన్ని), తాళ్లూరి నవీన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం, బాబు సూపర్ సిక్స్ పధకాల ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తమ ప్రాంతానికి వారికి స్థానికులు ఘన స్వగటం పలికి హారతులు పట్టారు. భారీగా కూటమి శ్రేణులు వెంటరాగా మహిళామండల వీధి, తురాయి చెట్టు వీధి, కెల్ల వీధి, సున్నపు వీధి, తెలకల వీధి పుణ్యపువీధి, కానుకుర్తి వీధిలో ఇంటి ఇంటి ప్రచారం చేపట్టారు. బాబు సూపర్ సిక్స్ పధకాలు, ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం హయాంలో మున్సిపాలిటీకి కార్పొరేషన్ స్థాయిని కల్పించిన తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో నగరం ఆ స్థాయిలో అభివృద్ధి చెండలేదన్నారు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక వసతులను మెరుగు పరచుకోవచ్చని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడును ఎంపీగా, గొండు శంకర్ను ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, వివిధ డివిజన్ల ఇంచార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले