ఫలించిన కూటమి వ్యూహం

ఫలించిన కూటమి వ్యూహం

Share with
Views : 8
ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమిగా మారిన తర్వాత సీట్ సర్దుబాటు విషయంలో జనసేన సానుభూతిపరులుగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న అనేక మంది కూటమికి వ్యతిరేకంగా మాట్లాడారు. తక్కువ సీట్లు తీసుకున్నారని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య దూషణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక బీజేపీ పూర్తిగా వేరే ట్రాక్‌లో ఉండేది. ఆ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఉండేవారు. అందుకే ఆ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది పెద్ద పజిల్ గా ఉండేది. ఏపీలో ఎన్డీఏ కూటమి ఓట్ల బదిలీ జరిగితేనే మంచి ఫలితాలు సాధిస్తుంది. ఎందుకంటే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఆరు లోక్ సభ స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన రెండు పార్లమెంట్, ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. టీడీపీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ చోటా మూడు పార్టీలపై ఓటర్లలో స్పష్టమన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో గాజు గ్లాస్ గుర్తు గందరగోళం కూడా వచ్చింది. కానీ ఒక్క సారి ప్రచారం ప్రారంభించిన తర్వాత ఎలాంటి సమస్యలు కనిపించలేదు. స్మూత్ గా ప్రచారం చేసుకుపోయారు. మూడు పార్టీల మధ్య వివాదాలు సృష్టించాలని వైసీపీ వైపు నుంచి కొన్ని వ్యూహాలు అమలయ్యాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం విషయంలో అనేక పుకార్లు కూడా రేపారు. అయితే ఏదీ నిలబడలేదు. అంతా సాఫీగా సాగిపోయింది. ఉమ్మడి ప్రచారాలు .. మూడు పార్టీల నేతలు తమ పార్టీల గురించి కాకుండా.. కూటమి గురించి ఆలోచించేలా చేయడంలో సక్సెస్ అయ్యాయి. కూటమి మద్దతుదారులుగా ఉన్న ఓటర్లందర్నీ పోలింగ్ బూత్‌లకు తెచ్చుకోగలిగితే చివరి మెట్టు కూడా సాఫీగా ఎక్కినట్లే అవుతుంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले