సిబ్బందిని అభినందించిన కలెక్టర్

సిబ్బందిని అభినందించిన కలెక్టర్

Share with
Views : 10
సిబ్బందిని అభినందించిన కలెక్టర్ శ్రీకాకుళం, మే 13 : జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ అభినందనలు తెలియజేసారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జట్టుగా పనిచేస్తే విజయం దక్కుతుంది అనడానికి అంతా కలిసి గడిచిన 14 గంటలుగా చేసిన శ్రమ నిదర్శనమని చెప్పారు. ఎన్నికలను జిల్లాలో విజయవంతం చేయడంలో గడచిన కొద్ది నెలలుగా అంకితభావం, పట్టుదలతో విశేష కృషి చేసిన జిల్లా అధికారులకు, నోడల్ అధికారులకు, ఎన్నికల విధులు నిర్వహించిన అన్ని స్థాయిల్లో సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले