ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా

Share with
Views : 6
ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు కలెక్టర్‌ను బదిలీ చేసింది. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. మూడు జిల్లాల్లో 12 మంది ఇతర పోలీసు అధికారుల సస్పెన్షన్ వేటు వేసింది. ఘర్షణలకు సంబంధించి అన్ని కేసులపై సిట్ ఏర్పాటై రెండు రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని .. ఇప్పటికే నమోదైన కేసుల్లో అవసరమైన అదనపు సెక్షన్లను జతపరచాలని స్పష్టం చేసింది. కౌంటింగ్ తర్వాత కూడా హింస చెలరేగే అవకాశం ఉండటంతో 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలని ఆదేసించింది. హింస ప్రజ్వరిల్లవడం వెనుక పోలీసుల కుట్ర ఉందని.. తేలడంతో పన్నెండు మంది ఇతర అధికారులపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా అల్లరి మూకలకు సమాచారం ఇవ్వడం.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవడం.. నిందితుల్ని అరెస్టు చేయకపోవడం వంటివి చేశారని ఈసీ గుర్తించింది. చీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డిపైనా ఈసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఒకటి , రెండు రోజుల్లో ఆయనపైనా వేటు పడటం ఖాయమని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఈసీ తాజా చర్యలతో అధికార వర్గాల్లో కలకలం రేగింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले