ప్రభుత్వంపై పాజిటివ్ ఉంటే.. ఓటు వేయడానికి ఆసక్తి చూపరు

ప్రభుత్వంపై పాజిటివ్ ఉంటే.. ఓటు వేయడానికి ఆసక్తి చూపరు

Share with
Views : 6
ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది. ఈ రెండు శాతం చిన్నది కాదు. ఎందుకంటే హై పోలింగ్ లో ఎంత చిన్న మొత్తం పెరిగినా అది సంచలనమే. ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంటే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దింపడానికి ఉత్సాహంగా ఓటింగ్ కు వస్తారు.. ఆ ప్రభుత్వంపై పాజిటివ్ ఉంటే.. ఓటు వేయడానికి ఆసక్తి చూపరు… అనేది భారత రాజకీయాల్లో చాలా రోజులుగా వినిపించే ఓ సూక్తి. దీన్ని రాజకీయవర్గాలు ఎక్కువగా నమ్ముతూంటాయి. వీరి నమ్మకానికి తగ్గట్లుగానే అనేక రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారిపోయాయి. . 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరింది. ఓడిపోయిన వాళ్లతో పాటు గెలిచిన వారి మైండ్ బ్లాంకయ్యే రిజల్ట్స్ వచ్చాయి. 2019తో పోలిస్తే 2024లో రెండు శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు దూరాభారమైనా, ఖర్చులకు వెనుకాడకుండా వచ్చి ఓటేసి వెళ్లారు. అయితే ఏపీలో తమకు పాజిటివ్ ఓటు పడిందని వైసీపీ నేతలు అంటున్నారు. నిజానికి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఇదే చెప్పారు. ఓటర్లలో వాలంటీర్లు, తాము ఉద్యోగాలిచ్చిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయని .. ఈజీగా గెలిచేస్తామనుకున్నారు. అధికారం చేతుల్లో ఉండటంతో తమ వారితో ఓట్లను బాగానే నమోదు చేసుకున్నారు.కానీ ఫలితం మాత్రం .. ఘోరంగా వచ్చింది. వైసీపీ అసలు రేసులోనే కనిపించలేదు. తాజా ఎన్నికల్లో ప్రతి వంద మందిలో 82 శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం మామూలు విషయం కాదు. పోస్టల్ ఓట్లలో కూడా 95 శాతానికిపైగా వినియోగించుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. మామూలుగా అయితే వారు దరఖాస్తు కూడా సగం మందే చేసుకుంటారు. ఎలా చూసినా ఆంధ్రప్రదేశ్ కు సంబంధిచిన ఓటర్లలో ఓ రకమైన భావన ఉందని ఈ పోలింగ్ వేవ్ చూస్తే అర్థమవుతుంది. ఈ భావన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న కసి అని వైసీపీ వర్గాలంటున్నాయి. కాదు ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలన్న తపన కనిపించిందని విపక్షాలు చెబుతున్నాయి. పాజిటివ్ ఓటు వేయడానికి ఇలా వెంటపడి .. అష్టకష్టాలు పడి ఏపీకి వెళ్లే వారు ఉంటారని ఎక్కువ మంది భావించడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేవాళ్లే ఉంటారని అంచనా. నిజమేమిటో కౌంటింగ్ లో తేలిపోనుంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले