మధ్యతరగతి ఓటు తో కూటమి గెలుస్తుంది

మధ్యతరగతి ఓటు తో కూటమి గెలుస్తుంది

Share with
Views : 5
ఏపీలో అధికారపీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరిని కదిలించినా ఫలితాల గురించే ముచ్చట. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో కూటమిదే విజయమని విశ్లేషణలు వ్యక్తం అవుతున్నా, అది ప్రో ఇంకంబెన్సీ అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఏపీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే కమ్మ, కాపు సామాజిక వర్గాలు టీడీపీని ఆదరించినట్లుగా తెలుస్తోంది. ఐదేళ్లపాటు కమ్మ సామాజిక వర్గానికి పట్టున్న గ్రామాల్లో కమ్మవారిపై వేధింపులు, దూషణల పర్వం కొనసాగడంతో వారంతా కసితో టీడీపీకి ఓటేసి ఉంటారని దాంతోపాటు గత ఎన్నికల్లో వైసీపీని ఆదరించిన కాపులు ఈసారి కూటమికి జైకొట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఐదేళ్లుగా వైసీపీ మంత్రులంతా పవన్ ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకురావడంపై కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో కూటమిని బలపరిచిందనే టాక్ వినిపిస్తోంది. 2019లో వైసీపీకి ముద్రగడ మద్దతునిచ్చి కాపుల ఓట్లు అటు వైపు మళ్ళించినా ఈసారి కూడా ఆయన అలాంటి ప్రయత్నం చేసినా అవేవీ కాపుల్లో ప్రభావం చూపలేదు. పైగా చైతన్యంతో కాపులు ఓటేసినట్లుగా చెబుతున్నారు. ఇక, పథకాలు అందుకున్న వారు వైసీపీకి మద్దతుగా నిలిచినా, కీలకమైన మిడిల్ క్లాస్ ఈ ఎన్నికల్లో కూటమిని బలపరిచినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ మూకల అరాచకాలు, వైసీపీ కార్యకర్తలకే పథకాలతో విసిగి కూటమిని ఆదరించి ఉంటారని .. ఆ కారణంగానే ఓటేయ్యాడానికి బద్దకించే మిడిల్ క్లాస్ వర్గం ఈసారి పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొనడంతో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని అది వైసీపీకి ప్రతికూలంగా మారుతుందని అంటున్నారు రాజకీయ పండితులు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले