సుప్రీం కోర్టు తీర్పు పై షర్మిల స్పందన

సుప్రీం కోర్టు తీర్పు పై షర్మిల స్పందన

Share with
Views : 8
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాజకీయ నేతలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓ పరిణామం మాత్రం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దానిపై ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు స్పందించింది. దీంతో తిరిగి ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇందుకు కారణమైన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ స్పందించారు.రాష్ట్రంలో తొలిసారి కడప లోక్ సభ సీటులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేంద్రంగానే ఎక్కువగా ప్రచారం సాగించారు. దీంతో వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించి ఆమె ఈ కేసుపై మాట్లాడకుండా ఉత్తర్వులు పొందారు. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లినా వైఎస్ షర్మిలకు కానీ, ఇదే కేసులో ఉన్న వివేకా కుమార్తె సునీతకు కానీ ఊరట దక్కలేదు. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ లోపు ఎన్నికలు ముగిసిపోయాయి.ఎన్నికలు ముగిశాక సుప్రీంకోర్టు కడప కోర్టు ఉత్తర్వులపై విచారణ జరిపింది. వివేకా కేసులో షర్మిల, సునీతతో పాటు ఇంకెవరూ మాట్లాడకుండా కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ మేరకు నిన్న తీర్పు వెలువరించింది. కానీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో షర్మిల సహా మిగతా వాళ్లూ వివేకా కేసుపై మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో సహజంగానే సుప్రీంకోర్టు ఆలస్యంగా ఇచ్చిన తీర్పు ప్రభావం కూడా లేకుండా పోయింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले