పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ… వారి పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం చరిత్రలో మొదటి సారి.

పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ… వారి పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం చరిత్రలో మొదటి సారి.

Share with
Views : 6
నేరపూరిత మనస్థత్వం ఉన్న వ్యక్తి చేతుల్లోకి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు వెళ్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో గత ఐదేళ్లుగా ఏపీ చూసింది. బాధితులు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఒక్క శాతం కూడా ఎవరికీ కలగలేదు. తమపైనే కేసులు పెడతారేమోన్న భయంతో చాలా మంది కళ్లు మూసుకున్నారు. నష్టాన్ని భరించారు. ఎదురు కేసులు పెడతారేమోనన్న భయంతో సామాన్య జనం వణికిపోయారు. అలాంటి పరిస్థితిని తెచ్చి పెట్టుకుంది పోలీసులే. రాజకీయ పోలీసింగ్ కోసమే మొత్తం వ్యవస్థను దుర్వినియోగం చేయడం అసలుకే మోసం వచ్చేలా చేసింది. టీడీపీ నేతలపై హత్యాయత్నాలకు పాల్పడినా.. వారి ప్రధాన కార్యాలయంపై మూకలు దాడికి పాల్పడినా అందులో పోలీసు వ్యవస్థ ప్రమేయం నేరుగా ఉండటం ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అడ్డగోలు అరెస్టులు… ధర్డ్ డిగ్రీ ప్రయోగాలు.. చివరికి ఎన్నికల సమయంలో నేరాలు.. ఘోరాల వెనుక వారి ప్రమేయం బయటపడటం ఎవరైనా ఊహించగలరా ? పోలీసు వ్యవస్థ ఘోరంగా పని చేసిందని… పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ… వారి పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం చరిత్రలో మొదటి సారి. ఇలాంటి పరిస్థితుల్ని ఎవరో తీసుకు రాలేదు.. డిపార్టుమెంట్‌లో వాళ్లే తెచ్చుకున్నారు. దానికి పూర్తి బాధ్యత వాళ్లదే. అయితే ఇక్కడ వ్యక్తులు చేసిన తప్పులు వ్యవస్థ మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇదే అసలు విషాదం !
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले