ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి లేని సంబంధాలను అంటగడుతున్నారు*: లావు కృష్ణ దేవరాయలు

ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి లేని సంబంధాలను అంటగడుతున్నారు*: లావు కృష్ణ దేవరాయలు

Share with
Views : 6
• *ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి లేని సంబంధాలను అంటగడుతున్నారు* • *కులం పేరుతో, వర్గం పేరుతో తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు* • *టీడీపీకి సానుకూల బూత్ లలో తక్కువ మంది పోలీసులని పెట్టి వైసీపీ సానుకూల బుత్ లలో ఎక్కువ మంది పోలీసులను పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టారిని చేస్తున్న విమర్శలపై సిట్ నిజాలు బయట పెట్టాలి* • *అదికారులను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందామని వైసీపీ, వైసీపీ బ్లూ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై సిట్ విచాణ జరిపి నిజాలను బటయ పెట్టాలి* • *మా కాల్ డేటా, వారి కాల్ డేటాను బయటకు తీసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి* • *అవాస్తవాలను ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి* • *తప్పుడు ప్రచారంపై ఈసీ, సిట్ ఛీప్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం* • *పరువు నష్టం దావాకు చర్యలు తీసుకుంటాం* • *నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు* రాష్ట్రంలో అరాచకాలను సృష్టించిన వైసీపీ నేతలు దాన్ని టీడీపీ నేతలపై రుద్దేందుకు యత్నిస్తున్నారని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. కులం రంగు పులిమి, అదికారులతో లేని సంబంధాలను అంటగట్టి తాము లబ్ధి పొందినట్లు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మండిపడ్డారు. ఈ అవాస్తవాలపై సిట్ విచారణ జరిపి అసలు నిజాలను బయటపెట్టాలని కోరారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. *లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ..* రాష్ట్రంలో అరాచక ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. సిట్ అధికారులకు మావైపు నుండి ఆధారాలు పంపిచాం. ఎన్నికల అయ్యాక వైసీపీ అసత్య ప్రచారానికి తెరలేపింది. పల్నాడులో జరిగిన ఘటనలను మాపై రుద్దేందుకు కుట్ర చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాదవ్ మా కుటుంబానికి పరిచయం ఉన్నట్లు సాక్షిలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అవాస్తవాలని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నాం. కాల్ డేటాను బయట పెట్టి నిజయాలను తెలపాలని కోరుతున్నాం. ఎస్పీ ఫ్యామిలీకి, మా కుటుంబానికి పరిచయం ఉన్నట్లు నిరాధరామైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు మేము ఎస్సీని కలిసింది కూడా లేదు. అయినా అసత్యాలను ప్రచారం చేస్తూ జనాల్లోకి తప్పుడు రాతలను తీసుకెళ్తున్నారు. దీనిపై సిట్ కు నేను లేటర్ రాస్తున్న. నేను గాని మా ఫ్యామిలీగాని ఎస్పీని గాని వారి కుటుంబాన్ని గాని కలిసినట్లు ఏమైనా రుజువు ఉంటే బయట పెట్టాలి. టీడీపీ చెప్పినట్లు పోలీసులు వినడంతోనే పల్నాడులో హింస జరిగినట్లు సాక్షిలో ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. సెన్సిటీవ్ బూత్ లలో బందోబస్తును పెంచాలని కోరాం. ఇబ్బంది సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పాం. వైసీపీ నేతలు కోరిన బూత్ లలో కూడా బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేయాలని కోరాం. దాదాపు 300 సెన్సిటీవ్ బూత్ లలో భత్రతా ఏర్పాట్లపై ఫిర్యాదు చేశాం. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న బూత్ లలో తక్కువ మంది పోలీసులను పెట్టి వైసీపీకి అనుకూలంగా ఉన్న బూత్ లలో ఎక్కువ మంది పోలీసులును పెట్టారని నిరాధారమైన విమర్శలు చేస్తున్నారు. డేటా అంతా ప్రజలు చూసుకోవాడనికి అందుబాటులో ఉంచాలి. టీడీపీ అనూకూలంగా ఉన్న బూత్ ల వద్ద తక్కు మంది పోలీసులు పెట్టారని వైసీపీ నేతలు చేస్తున్న అవాస్తవాలను సిట్ ఖండించాలి. పోలింగ్ అంతా టీడీపీ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై కూడా సిట్ విచారణ చేపట్టాలి. నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నాను. నావైపు నుండి గాని నా చుట్టుపక్కల ఉన్నవారి నుండి గాని ఏ అధికారికైనా ఫోన్లు చేసి ప్రలోభ పెట్టడం జరిగినట్లు ఉంటే కాల్ డేటాను భయటపెట్టవచ్చు. ఎంపీగా ఉండి అంతా నేనే చేశానని ప్రచారం చేయడం దానికి మళ్లీ కులం రంగు పులిమి విమర్శలం చేయడం సిగ్గుచేటు. ఒక కులానికి ఒక వర్గానికి వైసీపీ నన్ను పరిమితం చేయాలని చూస్తుంది. ఇది అసాధ్యం నేను ప్రజల మనిషిని ప్రజల్లో ఉంటా. నాపైనే దాడి చేశారు. నా వాహనాలను ధ్వంసం చేశారు. సిట్ పూర్తిగా విచారణ చేపట్టాలి. అందరి కాల్ డేటా తీసుకోవాలి. నా వైపు నుండి తప్పు ఉంది అని భావిస్తే నా పేరును కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొనవచ్చు. ప్రలోభాలకు గురిచేశామని వైసీపీనేతలు చేస్తున్న ప్రచారంపై నిజాలు భయటపెట్టాలి. పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి. పల్నాడు ప్రజలు ఇది గమనించాలి. పమిడిపాడు, కేపీపురం, రెంటాలలో ఏమి జరిగిందో ప్రజలందరికి తెలుసు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. సిట్ చీఫ్ కు ఫిర్యాదు చేస్తాం. వాస్తవాలను బయట పెట్టాలని కోరుతాం. అవాస్తవాలను ఖండించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. పరువు నష్టం దావాకు వెళ్తామని లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले