హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదిక

హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదిక

Share with
Views : 6
రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై రెండ్రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. కాగా ఆంధ్రప్రదేశ్​లో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం (EC) ఆదేశాల మేరకు ఐజీ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT​) ఏర్పాటైంది. పల్నాడు, తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైనా కేసు నమోదు చేసేలా చూడాలని అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లను సైతం జోడించాలని ఇప్పటికే డీజీపీ ఆదేశించారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను సైతం విచారించారు. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం, ఎఫ్ఐఆర్‌లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసీ కొందరు నిర్లక్ష్యం చేశారన్న సిట్ బృందం పేర్కొంది. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న సిట్‌ బృందం, హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని గుర్తించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం ఉంది. కాసేపట్లో సీఈవో, సీఈసీకి సిట్ నివేదికను ప్రభుత్వం పంపనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले