అధికారులు అలర్ట్ అవుతున్నారు

అధికారులు అలర్ట్ అవుతున్నారు

Share with
Views : 6
ఏపీ రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. టీడీపీ పవర్ లోకి వస్తుందని విశ్వాసంతో కీలక పోస్టింగ్ ల కోసం అప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రో టీడీపీ అని ముద్రపడిన అధికారులపాటు వైసీపీ నేతలతో సన్నిహితంగా వ్యవహరించినవారు సైతం చంద్రబాబు ప్రాపకం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు విదేశాలకు వెళ్ళడంతో రెండు రోజుల నుంచి ఆయనతో టచ్ లోకి వెళ్లేందుకు పలువురు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో చాలామంది అధికారులు కీ పోస్టింగ్ ల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని…తమను గుర్తించాలనే తలంపుతో వేర్వేరు రూట్లలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే బీజేపీ, జనసేన నేతలతో కీలకపోస్టింగ్ ల కోసం తమ పేర్లను సిఫార్స్ చేయించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి సన్నిహితంగా వ్యవహరించి , టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నామని లోకేష్ ఇప్పటికే ప్రకటించడంతో పలువురిలో అలజడి మొదలైంది. దీంతో ముందుగానే పలువురు అధికారులు అలర్ట్ అవుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే అలా చేయాల్సి వచ్చిందని… తాము టీడీపీకి వ్యతిరేకం కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. /
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले