ఎవరి ప్రభుత్వమో నిర్ణయించేది పోస్టల్ బ్యాలెట్ మాత్రమే ఈ ఎన్నికల్లో

ఎవరి ప్రభుత్వమో నిర్ణయించేది పోస్టల్ బ్యాలెట్ మాత్రమే ఈ ఎన్నికల్లో

Share with
Views : 8
పోస్టల్ బ్యాలెట్ల ఫైనల్ లెక్క తేలింది. మొత్తం జిల్లాల వారీగా వచ్చిన లెక్కలను చూస్తే 5,39,189 ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ల గడువు పూర్తియన తర్వాత చెప్పిన దాని కంటే దాదాపుగా యాభై వేల ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి రెండున్నర లక్షల మంది ఎక్కువగా ఓటు వినియోగించుకున్నారు. ఇది అసాధారణమే. ఈ సారి చెల్లని ఓట్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఇన్ వాలిడ్ అవుతాయి దీనికి కారణం పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేకపోవడం. అయితే ఈ సారి ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవద్దని టీడీపీ నేతలు ఈసీని కోరారు. ఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విజ్ఞప్తికి అంగీకరించారు. వీలైనంత త్వరగా లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంలో ఈ సారి ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపించారు. పోస్టల్ బ్యాలెట్లు భారీగా పెరగడంతో పెరగడంతో ఎవరికి ప్లస్ .. ఎవరికి మైనస్ అన్న చర్చ జరుగుతోంది. ఐదేళ్లలో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని ఇప్పటికే అనేక విశ్లేషణలు వచ్చాయి. ఉద్యోగులతో పాటు ఐదు లక్షల కుటుంబాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే.. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले