సజ్జలు మనసులో కూటమి గెలుపు ఖాయమైంది

సజ్జలు మనసులో కూటమి గెలుపు ఖాయమైంది

Share with
Views : 6
వైసీపీ ఓటమి ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ దిశగా మానసికంగా ప్రిపేర్ అవుతున్నట్టు ఉన్నారు. ఫలితాల విడుదలకు మరో కొద్ది రోజుల సమయమే ఉండటంతో ఇప్పుడు గెలుపుపై అతికి పోయి అభాసుపాలు కావొద్దని నిర్ణయించుకున్నట్టు ఉన్నారు. మునుపటిలా గెలుపు ధీమాను పక్కనపెట్టేసి తాజాగా మరోసారి టీడీపీ కోసం ఈసీ పని చేసిందని సజ్జల ఏడుపు మొదలు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత బాబుకు ఈసీకి అనుకూలంగా వ్యవహరించిందని సజ్జల ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందని.. మిగతా చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే అందుకు సంబందించిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో అన్యాయం జరిగిందని అందుకే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశామన్నారు. సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలను చూస్తుంటే వైసీపీ గెలుపుపై ఆయనకు ధీమా సడలడంతో పాటు కూటమి గెలుపు ఖాయమని సంకేతాలు ఇచ్చినట్లుందన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే వైసీపీ ఓటమికి ముందస్తు కారణాలను సజ్జల ప్రిపేర్ చేసుకుంటున్నట్లు ఉందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఓడితే టీడీపీకి ఈసీ సహకరం అందించడం వల్లే కూటమి గెలిచిందని…ఈ విషయాలను తాము ముందే చెప్పామని ప్రిపేర్డ్ గా మాట్లాడుతున్నట్టు ఉందని అంటున్నారు. గత కొద్ది రోజులుగా కనిపించకకుండా పోయిన సజ్జల… పోలింగ్ పై పోస్ట్ మార్టం నిర్వహించే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले