పల్నాడు వల్లకాడుగా మార్చారు: దేవినేని ఉమ

పల్నాడు వల్లకాడుగా మార్చారు: దేవినేని ఉమ

Share with
Views : 6
*ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పిన్నెల్లి పైశాచికత్వం* *- మాచర్లలో పేట్రేగిన వారికి త్వరలోనే బుద్ధి చెప్తాం* *- మాచర్ల ప్రజల చేతిలోనే పిన్నెల్లికి బడితపూజ* *- పిన్నెల్లిని మాచర్ల నుండి బహిష్కరించాలి* *- జగన్ రెడ్డి అండ చూసుకునే పిన్నెల్లి దుర్మార్గాలు పెచ్చుమీరాయి* *- పిన్నెల్లి పైశాచికం పుస్తకావిష్కరణలో టీడీపీ నేతలు వ్యాఖ్య* ప్రభుత్వం అండ చూసుకుని పిన్నెల్లి పైశాచికత్వం తారా స్థాయికి చేరిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు, దోపిడీ విధానాలపై తెలుగుదేశంపార్టీ పిన్నెల్లి పైశాచికత్వం అనే పుస్తకాన్ని రూపొందించింది. ఈ పుస్తకాన్ని టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, పిల్లి మాణిక్యరావు, మరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ధారూనాయక్, హైకోర్టు న్యాయవాది పారా కిషోర్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... *ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పిన్నెల్లి మాచర్లలో అరాచకాలు, బుద్దా వెంకన్న:* మాచర్ల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అతను గెలిచాడు. అప్పటి నుంచి అతను, అతని సోదరుడు చేసే అరాచకాలకు అడ్డురాకుండా ఏకఛత్రాధిపతిగా ఏలుతున్నాడు. పిన్నెల్లి పైశాచికత్వానికి అంతులేకుండా పోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పిన్నెల్లి 2 వేల కోట్ల దోపిడి చేశాడు. పిన్నెల్లి పాలనలో 8 హత్యలు, 79 దాడులు జరిగాయి. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలపై దాదాపు 51 దాడులు జరిగాయి. ఎన్నికల రోజున మేము మాచర్లకు వెళితే మా తరపున వచ్చిన లాయర్ కిశోర్ పై కూడా దాడి చేసి తల పగులగొట్టారు. పిన్నెల్లి పైశాచికత్వంపై నేడు ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్రఅంతా కూడా నేర చరిత్రే. హత్యలు, దోపిడీలతోపాటు దేవాలయాలలోని విగ్రహాలను సైతం దొంగతనాలు చేసేవారు. జగన్ అతన్ని అతిగా ప్రేమిస్తారు. పిన్నెల్లిది నేర మనస్తత్వం. జగన్ ది కూడా నేర మనస్తత్వం అందుకే జగన్ కు పిన్నెల్లి అంటే ఇష్టం.2004 నుంచి 2012 వరకు పిన్నెల్లికి ఎదురులేకుండా పోయింది. పిన్నెల్లి సంపాదించుకోవడానికి వారికి వారే ఒక సపరేటు చట్టాన్ని రూపొందించుకున్నారు. దేవాలయాల్లో విగ్రహాలు దోచుకోలేదని పిన్నెల్లి మాచర్ల సెంటర్ లో భార్యా, పిల్లలతో వచ్చి ప్రమాణం చేయగలవా అని ఛాలెంజ్ విసురుతున్నాను. పేరుప్రఖ్యాతులుగాంచిన మాచర్ల నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా పెట్టుకున్న పిన్నెల్లిని పెట్టారు. సోదరుడు కూడా దొంగే. ఇద్దరు కలిసి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకు మా మీద దాడికి పాల్పడిన సంఘటనను అందరూ చూశారు. 1996 నుంచి ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్రంలో ఫ్యాక్షనిజం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు. గతంలో ఎన్నికలప్పుడు అనేక చోట్ల రీపోలింగ్ జరిగేది. నేడు రీ పోలింగ్ ఎక్కడా జరగడంలేదు. ఒక్క మాచర్ల లోనే జరుగుతోంది. పిన్నెల్లి అక్కడి ఈవీఎం లను పగలగొట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఈవీఎంలో తెలుగు దేశం పార్టీకి 18 ఓట్లైతే, 7 ఓట్లు వైసీపీకి ఉన్నాయి. దీన్ని బట్టి పిన్నెల్లిపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత తెలుస్తోంది. 4 ఓట్లల్లో 1 ఓటు పిన్నెల్లికి, 3 ఓట్లు బ్రహ్మారెడ్డికి పడ్డాయి. దీన్ని చూసి ఓర్వలేక అక్కడ అరాచకాలు సృష్టించి ఈవీఎంలు పగులగొట్టారు. నియోజకవర్గం మొత్తం ఎన్నికలు ఆపేయాలని పన్నాగం పన్నారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్ పై ట్యాక్స్ వేసి దాదాపు 12 వందల కోట్లు దోచుకున్నాడు. కొందరికి అన్నం, కూర అంటే ఇష్టమైతే, పిన్నెల్లికి గ్రానైట్ రాళ్లంటే ఇష్టం. ఎవరిమీదైనా కోపమొస్తే ఆ రాళ్లతోనే కొట్టి ఆ ముచ్చట తీర్చుకుంటాడు. ఆత్మకూరు, రాయవరం, అలుగురాజుపల్లి, అడిగొప్పల, అమ్మవారిగుడి పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ తవ్వకాల్లో దాదాపు 70 కోట్లు కొట్టేశారు. కన్నగుంట్ల, వేల్పూరు మండలంలో కంకర తవ్వి 40 కోట్లు దోచుకున్నాడు. మాచర్లలో సీసీ రోడ్లు వేసినా, ఎక్కడైన కాలువ మరమ్మత్తులు చేసినా ఏ చిన్న నిర్మాణం చేపట్టినా పిన్నెల్లికి 5 శాతం వాటా కావాలి. 10 లక్షల వర్క్ జరుగుతుంటే దాంట్లో 50 వేల రూపాయలు లంచం ఇవ్వాల్సిందే. రైతులు తమ పొలాల పాస్ పుస్తకాలకు అప్లై చేస్తే 15 వేలు పిన్నెల్లికి చెల్లించాల్సి ఉంటుంది. పిన్నెల్లి అరాచకాలు, ఆగడాలు అన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. పిన్నెల్లి అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు. 2022 డిసెంబర్‌ 16న మాచర్లలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం తెలపెట్టగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు విరుచుకుపడి, బీభత్సం సృష్టించారు. మాచర్లను రణరంగంగా మార్చేశారు. బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, టీడీపీ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. అంత జరిగినా అప్పటి ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి దాన్ని టీడీపీ నాయకుల తప్పుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం రావడంతో.. ఏ గ్రానైడ్ తో సంపాదించారో ఆ గ్రానైడ్ రాళ్లతోనే ప్రజలు చంపేస్తారని గ్రహించి పిన్నెల్లి, అతని సోదరుడు ఊరొదలి పారిపోయే పరిస్థితి వచ్చింది. భయపడి కోర్టును ఆశ్రయించి కొన్నాళ్లు బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీ మూకలు కొందరు మారుణాయుధాలతో దాడులు చేస్తున్నారు. వైసీపీ రౌడీ మూకలు మారణాయుధాలతో వారిపై దాడి చేశారు. వారిని బలవంతంగా కారుల్లో ఎక్కించుకుని పోలింగ్ కేంద్రానికి దూరంగా వదిలిపెట్టారు. ఆరోజు బుద్దా వెంకన్నను రక్షించినట్లు నన్ను రక్షించాడని, లేకుంటే చంపేశారని వైసీపీ రౌడీ మూకలు మారణాయుధాలతో వారిపై దాడి చేశారు. వారిని బలవంతంగా కారుల్లో ఎక్కించుకుని పోలింగ్ కేంద్రానికి దూరంగా వదిలిపెట్టారు. జగన్ ని మించిన సైకో పిన్నెల్లి. రేపు పలానా పలానా వారు వస్తున్నారు. వారిపై దాడి చేసి చంపితే ఇంతిస్తానని వేలం పాట పెట్టాడు. మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తానంటే అప్పటి దాక ఆ తురకా కిశోర్ కి కౌన్సిలర్ సీటు కూడా లేదు. 2024 తరువాత ప్రజల చేత సమాధానముంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో చక్కగా తిరగగలవా? మాచర్ల ప్రజలే నీకు గ్రానైట్ రాళ్లతో బుద్ధి చెబుతారు. *మాచర్ల అల్లర్లకు కారణమైనవారికి త్వరలోనే తగిన బుద్ధి చెప్తాం, హైకోర్టు అడ్వకేట్ కిషోర్:* స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్చి 11న మాచర్లలో జరిగిన హింసలో గాయపడ్డాను. మాచర్లలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండదు. కొందరు పోలీసులు యూనిఫామ్ కూడా వేసుకోరు. పిన్నెల్లి పాలేరుల్లా కొందరు పోలీసులు ఉన్నారు. వారిలో ఒకతను భక్తవత్సల రెడ్డి. అతను ఒంగోలు వెళ్లినా పిన్నెల్లి సేవలోనే తరిస్తున్నాడు. మా మీద జరిగిన దాడిలో పోలీసులు సక్రమంగా వ్యవహరించేలేదనే ఉద్దేశంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. వేసవి తరువాత విచారణ జరుగుతుంది. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు. పిన్నెల్లిపై ఇంకా 307, హత్యా యత్నం కేసులు కూడా ఉన్నాయి. వాటిపై కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. మాపై దాడి చేయడానికి ప్రయత్నించినవారిని పట్టుకోవడానికి కనీస ప్రయత్నం చేయలేదు. పోలీసు గన్ మెన్ ఎక్కడుంటాడో వారికి తెలుసు, అతనే ఈ కథంతా నడిపాడు. కారంపూడిలో హింస చేశారు. పోలీసులకు బాస్ లా వ్యవహరిస్తున్నాడు. ఇది ఎక్కవ రోజులు సాగదు. ప్రజాస్వామ్యబద్దంగా వారికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. *పిన్నెల్లికి ప్రజల చేతిలో బడితపూజ తప్పదు, పిల్లి మాణిక్యరావు:* పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైశాచికత్వంతో విర్రవీగాడు. అన్ని వివరాలతో నేడు పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఐదేళ్లలో పిన్నెల్లి విపరీతమైన అరాచకాలు సృష్టించాడు. అనేక దారుణాలకు పాల్పడ్డాడు. 2 వందల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దోపిడీ చేశాడు. పిన్నెల్లి రోడ్డుపైకి వస్తే బందిపోటు దొంగలను కొట్టినట్లుగా కొడతారు. *పిన్నెల్లిని మాచర్ల నుండి బహిష్కరించాలి, ధారూ నాయక్:-* రాష్ట్రవ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం గురించి చర్చ నడుస్తోంది. మాచర్ల చాలా పవిత్రమైన నియజకవర్గం..ఇలాంటి నియోజకవర్గానికి మచ్చ తెచ్చిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులు. మాచర్ల నియోజకవర్గాన్ని యావత్ రాష్ట్రమంతా అసహ్యించుకునే స్థాయికి పిన్నెల్లి పరువు తీశాడు. 20ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి మాచర్లలో అభివృద్ధిని ప్రజలకు దూరం చేశాడు. పిన్నెల్లి పాలనలో మాచర్ల నియోజకవర్గంలో వందలాది కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. పిన్నెల్లి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను పిన్నెల్లి తన రాజకీయ లబ్ధి కోసం అణగదొక్కుతూ వచ్చాడు. ఎస్టీ, బీసీలపై పిన్నెల్లి దాడులు లెక్కలేనన్ని జరిగాయి. తాగడానికి మంచినీళ్లు అడిగితే గిరిజన మహిళ సామూబాయిని ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య, జాలయ్యలను దారుణంగా పిన్నెల్లి అనుచరులు హత్య చేశారు. మరికొంత మందిని పిన్నెల్లి హత్య చేయించాడు, మరికొంత మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2004లో వెల్దుర్తి జెడ్పీటీసీగా ఎన్నికైన నాటి నుండి మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు ప్రారంభమయ్యాయి. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా ముఖ్యమంత్రి కులాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేగా ఎదిగి, నియోజకవర్గాన్ని దోచుకోవడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారింది. మాచర్లలో అభివృద్ధిని వదిలేసి, దోచుకోవడం, దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడడం పిన్నెల్లికి సైడ్ బిజినెస్ గా మారింది. ఎస్సీ, ఎస్టీల భూములను కూడా పిన్నెల్లి దోచుకున్నాడు. ఆ భూముల తాలూకు పాస్ పుస్తకాలు తన అనుచరుల పేర్ల మీద పెట్టి భూములను ఆక్రమించుకున్నాడు. నాగార్జునసాగర్ రోడ్డులో 30ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఎత్తిపోతల వద్ద కొంత భూమి, విమానాశ్రయం వద్ద 200ఎకరాల భూమి కబ్జాకు గురయ్యాయి. మాచర్లలో ఎక్కడ చూసినా కబ్జాలే. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నాగార్జునసాగర్ ఎస్.ఐ పూర్తిగా వైసీపీ ఏజెంట్ లా పనిచేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తికి పోలీసు డిపార్ట్మెంట్ పోస్టింగ్ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయిస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతున్నాననే భయంతోనే పాల్వాయిగేటు పోలింగ్ బూత్ లో ఈవీఎం పగులకొట్టడానికి కారణం. పిన్నెల్లి అరాచకాలు మీడియాలో బట్టబయలు కావడం వల్లే బాహ్య ప్రపంచానికి పిన్నెల్లి విశ్వరూపం తెలిసింది. లేదంటే తెలిసేది కాదు. పిన్నెల్లిని మాచర్ల నుండి బహిష్కరించాలి..పిన్నెల్లి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. *జగన్‌రెడ్డిని చూసుకుని పిన్నెల్లి ఆగడాలు హద్దు మీరాయి, దేవినేని ఉమామహేశ్వరరావు:* టీడీపీ పాలనలో ప్రశాంతంగా ఉన్న పల్నాడులో వైసీపీ పాలనలో పల్నాడు వల్లకాడుగా మారింది. పిన్నెల్లి పైశాచికం, రూ.2లక్షల ఆదాయం నుండి రూ.2వేల కోట్ల స్థాయికి ఎలా ఎదిగాడో జగన్ నేర సామ్రాజ్యానికి సంబంధించిన ఓ కేస్ స్టడీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు పిన్నెల్లి ఏ విధంగా నామినేషన్లు లేకుండా చేశాడో, అదే విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంభించాలంటూ పిన్నెల్లిని ఆదర్శంగా తన ఎమ్మెల్యేలకు చూపించాడు. మాచర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో పిన్నెల్లిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపిస్తే మరింత పైకి తీసుకెళ్తానని ప్రజలతో చెప్పాడు. అందుకే పిన్నెల్లి ఈవీఎం లను ధ్వంసం చేసేందుకు సాహసించాడు. ఈవీఎంలను బద్దలు కొట్టినవాడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాల్సిందిపోయి..పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందో విచారణ చేయాలని సిగ్గువిడిచి మాట్లాడాడు. పిన్నెల్లి చేసిన అరాచకాల్లో 79కేసుల్లో 51 కేసులు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలపై చేసిన దాడులకు సంబంధించినవే. చేరెడ్డి మంజుల అనే టీడీపీ పోలింగ్ ఏజెంట్ పై పిన్నెల్లి అనుచరులు గొడ్డలితో దాడి చేసినా మంజుల ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోలింగ్ ప్రక్రియలో పాల్గొంది. పల్నాటి పౌరుషాన్ని తెలియజేసింది. సరస్వతి పవర్ భూముల కుంభకోణంలో పిన్నెల్లి సోదరులు రైతులపై దాడులు చేశారు. అప్పట్నుంచి పిన్నెల్లి అరాచకాలు మొదలయ్యాయి. సీఐపై పిన్నెల్లి దాడులు చేసినా వైసీపీ పాలనలో పట్టించుకోలేదు. ఇలాంటి పిన్నెల్లికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు..రానున్న కాలంలో పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటాడు. పిన్నెల్లిపై ఉన్న కేసులన్నింటినీ కోర్టులో నిరూపించి తగిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले