పార్టీ కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ

పార్టీ కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ

Share with
Views : 8
రాష్ట్రంలో ఎన్నికలు కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఫలితాలపై చర్చించడానికి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు జూన్ 4కు ముందు ఒకరోజు‌ జూన్ 3న సమావేశం ఏర్పాటు చేశారు.‌ఎన్నికలు కౌంటింగ్ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఫలితాలపై చర్చించడానికి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు జూన్ 4కు ముందు ఒకరోజు‌ జూన్ 3న సమావేశం ఏర్పాటు చేశారు.‌హైదరాబాద్ నుంచి మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయానికి చేరుకొని, అక్కడ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.‌ అందుకనుగుణంగా పార్టీ నేతలు, కార్యకర్తలు జూన్ 3 మధ్యాహ్నం సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్నికల కౌంటింగ్ పై చర్చించారు. కౌంటింగ్ లో ఎలా వ్యవహరించాలో చర్చించారు.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పార్టీ కార్యాలయం నుంచే పవన్ కళ్యాణ్ పర్యవేక్షించనున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. 25 ఎంపి స్థానాల్లో రెండు స్థానాలకు జనసేన పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు‌. దీనిపై కేంద్రీకరించి జనసేన పని చేసింది. జనసేనాని అన్న నాగబాబు దాదాపు నెల రోజులుగా పిఠాపురంలోనే ఉండి‌ ఎన్నికలను పర్యవేక్షించారు. పిఠాపురంలో జబర్దస్త్ టీం, సీని ఆర్టిస్ట్ లు, సీని హీరోలు కదం తొక్కారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని ప్రచారం చేశారు. 21 స్థానాల్లో ఎన్ని గెలిచేనో? జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలిచేనో అని ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో నెలకొంది. ఇప్పటికే పోలింగ్ జరిగినప్పటి నుంచీ గెలిచే స్థానాలను లెక్కేసుకుంటున్నారు.‌ అయితే ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మినహాయిస్తే, మిగిలిన జిల్లాల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చని అనుమానం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, విజయనగరం జిల్లాలో నెలిమర్ల, విశాఖపట్నం జిల్లాలో విశాఖ సౌత్, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, పి.గన్నవరం, పశ్చిమగోదావరి జిల్లాలో నిడదవోలు, ఉంగుటూరు, తాడేపల్లిగూడేం, భీమవరం, నర్సాపురం, పోలవరం, కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, గుంటూరు జిల్లాలో తెనాలి, చిత్తూరు జిల్లాలో తిరుపతి, కడప జిల్లాలో రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాలకు జనసేన పోటీ చేస్తుంది. అలాగే కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. అందరి చూపు పిఠాపురం వైపే… ఎన్నికల ఫలితాలపై రోజు రోజుకు ఉత్కంఠ నెలకొంటుంది. పందెం రాయళ్లు కోట్లలో పందాలు కాస్తున్నారు. ఇదొక వ్యాపారంగా సాగుతుంది. రాష్ట్రంలో మిగతా స్థానాలు కంటే పిఠాపురంపై అందరి చూపు పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి తరపున పోటీ చేయడం, ప్రజాదరణ నేతగా పేరొందిన వంగాగీత వైఎస్ఆర్ సిపి తరపున పోటీ చేయడం పిఠాపురంలో ఎన్నికలు సంచలనంగా మారాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? ఓడుతారా? గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? అనే అంశాలపై చర్చ జరుగుతుంది. ఆ రకంగా పందెం రాయళ్లు పందాలు కాస్తున్నారు. ఎవరిని చూసిన పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నే వస్తుంది. అసలు జనసేనాని గెలుస్తారా? ఓడుతారా? అనేది జూన్ 4న తెలుస్తుంది.అయితే రాష్ట్రంలో కాపులు అత్యధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో కాపులతో ఇతర అగ్ర కుల సామాజిక వర్గాలు పవన్ కు మద్దతు ఇచ్చాయి. వంగాగీతకు రెడ్డి, దళిత సామాజిక వర్గాలతో పాటు బీసీల్లో ఎక్కువ భాగం మద్దతు ఇచ్చాయి. ఇక్కడి ఓటర్లు కూడా సామాజిక వర్గాల వారీగా విడిపోయారు. అయితే ఎవరు ఎవరికి పూర్తిస్థాయి మద్దతు ఇచ్చారో జూన్ 4న వెలువడే ఫలితాలను బట్టీ తెలుస్తుంది. అయితే మే 13న పోలింగ్ జరిగిన తరువాత టూర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారు.‌ జూన్ 3న రాష్ట్రానికి చేరుకుని, మంగళగిరిలో ఫలితాలపై సమీక్షిస్తారు. ఎక్కువ శాతం పిఠాపురంపైనే సమీక్ష ఉండొచ్చని సమాచారం.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले