పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల వ్యాలిడిటీపై స్ప‌ష్ట‌త

పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల వ్యాలిడిటీపై స్ప‌ష్ట‌త

Share with
Views : 8
ఏపీలో రెండు మూడు రోజులుగా చ‌ర్చ‌నీయాంశం అయిన పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల వ్యాలిడిటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. పోస్ట‌ల్ బ్యాలెట్ల విష‌యంలో చాలా చోట్ల రిట‌ర్నింగ్ అధికారులు సంత‌కం చేసినా, సీల్ వేయ‌లేదు. కొన్ని చోట్ల హోదా రాయ‌లేదు. దీంతో ఈ ఓట్లు చెల్లుతాయా లేదా అన్న సందేహ‌లు వ‌చ్చాయి. అయితే, ఈ ఓట్లను చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలివ్వాల‌ని కూట‌మి ఈసీని కోరింది. సంత‌కం ఉన్న ఓట్లు చెల్లుతాయ‌ని రాష్ట్ర ముఖ్య‌ ఎన్నిక‌ల అధికారి మీనా స్ప‌ష్ట‌త ఇచ్చారు. కౌంటింగ్ రోజున అవి వ్యాలీడ్ ఓట్లుగా గుర్తించాల‌ని ఆదేశించారు. కానీ, పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల విష‌యంలో వెన‌క‌ప‌డ్డామ‌న్న టెన్ష‌న్ లో ఉన్న వైసీపీ… అవి చెల్లుబాటు కాక‌పోతే త‌మ‌కు లాభం అవుతుందన్న ఉద్దేశంతో అభ్యంత‌రం చెప్పింది. సీఈవో ఆదేశాల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లెట‌ర్ రాసింది. తాజాగా సీఈసీ క్లారిటీ ఇచ్చింది. సీల్ లేక‌పోయినా, హోదా రాయ‌క‌పోయినా… గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు. అవ‌న్నీ వ్యాలీడ్ ఓట్లేన‌ని విస్ప‌ష్ట‌మైన స‌మాధానం పంపింది. దీంతో, వైసీపీ చెప్పిన అభ్యంత‌రాన్ని ప‌క్క‌న‌పెట్టినట్లు అయ్యింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले