చంద్రగిరి డిఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌పై వేటు

చంద్రగిరి డిఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌పై వేటు

Share with
Views : 12
ఎన్నికల కోడ్‌ అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న పోలీస్ అధికారి నిబంధనల్ని ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లోకి స్నేహితుడిని వెంట తీసుకువెళ్లిన చంద్రగిరి డిఎస్పీపై వేటు పడింది. డిఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌ను వెకెన్సీ రిజర్వ్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. మే13న పోలింగ్ ముగిసిన తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు డిఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌ వెళ్లారు. స్ట్రాంగ్‌ రూమ్ వద్దకు వెళ్లే సమయంలో చెవిరెడ్డి అనుచరుడిని తనతో పాటు బైక్ పై తీసుకెళ్లారు. మే14న జరిగిన ఘర్షణలపై విచారణ జరపుతున్న సిట్ బృందం సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తుండగా డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ వీడియోలు గుర్తించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ప్రవేశించడంపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరి డీఎస్పీని శరత్ రాజ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయా నికి సరెండర్ చేస్తూ జిల్లా ఎస్పీ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను అంచనా వేయడంలో విఫలమయ్యారని సిట్ నివేదించింది. శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమవ్వడంతో పాటు స్ట్రాంగ్‌ రూమ్‌లోకి అనుమతి లేని వ్యక్తిని అనుమతించడంపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకున్నారు. శరత్ రాజ్‌ కుమార్ మూడు నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రగిరిలో ఉన్న పరిస్థితుల్ని అంచనా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 2019లో తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో జరిగిన ఎన్నికల్లో రీపోలింగ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఫిర్యాదుచేసిన పట్టించుకోలేదని టీడీపీ ఆరోపించింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మధ్య వివాదాలు తారాస్థాయికి చేరినా పోలీసులు పట్టనట్టు వ్యవహరించారని ఘర్షణల నేపథ్యంలో సిట్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్పుచేతల్లోనే డీఎస్పీ పనిచేశారని, ఎన్నికల రోజు ఘర్షణలను నివారించడంలో పోలీసులు చర్యలు తీసుకోపోవడానికి డిఎస్పీనే కారణమని ఆరోపించారు. పులివర్తి నాని మీద దాడికి దారి తీసిన పరిస్థితులకు డిఎస్పీ విధి నిర్వహణలో విఫలం కావడమే కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले