సామాజిక మాధ్యమాల పోస్టులపై నిఘా*. *జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక*.

సామాజిక మాధ్యమాల పోస్టులపై నిఘా*. *జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక*.

Share with
Views : 6
* శ్రీకాకళం మే 30.సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియాలో) పోస్టులపై ప్రేత్యక నిఘా పెట్టామని జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గురువారం ఓ ప్రకటన జారీ చేశారు.వాట్సాప్, ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూప్స్ లో ఉద్దేశిపూర్వకంగా కుల,మత, రాజకీయ పార్టీలను, వ్యక్తులను రెచ్చగొట్టేలా పోస్ట్లు పెట్టడం,అవాస్తవాలు ఇతరులకు షేర్ షేర్ చేయకుండా గ్రూప్ అడ్మిన్ ముందస్తుగా నియంత్రణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక పేర్కొన్నారు.తప్పుడు వదంతులు పోస్ట్ చేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియా లేదా వాట్సాప్ లలో ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలపై ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదు.సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ప్రతి సున్నితమైన అంశం పైన ప్రత్యేక నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక ఒక ప్రకటన లో పేర్కొన్నారు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले