ఏపీలో ఎన్నికల సంఘం నిర్ణయాల పై వైసీపీ ఆగ్రహం

ఏపీలో ఎన్నికల సంఘం నిర్ణయాల పై వైసీపీ ఆగ్రహం

Share with
Views : 6

పీలో ఎన్నికల సంఘం నిర్ణయాల పై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి పార్టీల నేతల సూచనల మేరకు అధికారులు పని చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద టీడీపీ అభ్యర్దన మేరకు సీఈవో తీసుకున్న నిర్ణయం పైన వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఇదే వ్యవహారం పైన వైసీపీ ముఖ్య నేత పేర్ని నాని ఎన్నికల ప్రధానాదికారి మీనా పైన కీలక వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారుతోంది.

ఇష్టానుసారం నిర్ణయాలు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్‌ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్‌) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్‌ సిగ్నేచర్‌ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.

నిర్ణయం సరికాదు

13 ఏ, 13 బి పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇస్తారని, దానికి గెజిటెడ్‌ ఆఫీసర్ సర్టిఫికెట్‌ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచచ్చిందని ప్రశ్నించారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్‌ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.

ఉద్దేశపూర్వకంగానే

ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు.టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైయస్ఆర్‌సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले