వడగాల్పుల కారణంగా దేశంలో 54 మంది చనిపోయారు.

వడగాల్పుల కారణంగా దేశంలో 54 మంది చనిపోయారు.

Share with
Views : 8

దేశవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఈసారి ముఖ్యంగా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్ని వడగాల్పులు మంట పుట్టిస్తున్నాయి.

దీంతో జనం ప్రాణాలు అరచేత్తో పట్టుకుని ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే వరకూ వడగాల్పుల కారణంగా దేశంలో 54 మంది చనిపోయినట్లు కేంద్రం తెలిపింది.

ఢిల్లీ, పంజాబ్, ఒడిశాలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని భారత వాతావరణ విభాగం చెబుతోంది. ఒక్క ఒడిశాలోని సుందర్ గఢ్ లోనే గత 24 గంటల్లో వడగాల్పులకు 12 మంది చనిపోయినట్లు ఐయాన్స్ వార్తా సంస్థ తెలిపింది. జార్ఖండ్ లోని పాలమూ జిల్లాలో ఓ మహిళ సహా నలుగురు చనిపోయినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట స్ధాయిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. బీహార్ లోనూ వడగాల్పుల కారణంగా 8 మంది చనిపోయారు.

రాజస్థాన్ లో వడగాల్పుల తీవ్రత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి సూచించింది. వడగాల్పుల నుంచి ప్రజల్ని కాపాడటానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచించింది. మరో రెండు రోజుల్లో వడగాల్పుల తీవ్రత తగ్గవచ్చని భావిస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నాయి.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले