*పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారు?* *-ఎమ్మెల్సీ అశోక్ బాబు*

*పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారు?* *-ఎమ్మెల్సీ అశోక్ బాబు*

Share with
Views : 6
*పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారు?* *-ఎమ్మెల్సీ అశోక్ బాబు* పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం... నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరపున సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వైసీపీవారు రిట్ ఫైల్ వేశారు. వైసీపీవారు కేసును విత్ డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది, అది చెప్పకుండా సీఐఓ మేము ఒక మెమోని విత్ డ్రా చేసుకుంటున్నామని చెప్పారు. వైసీపీ దాన్ని హైలెట్ చేస్తోంది. అదేదో పెద్ద విజయం సాధించినట్లు చెప్పుకుంటున్నారు. సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇలా వివిధ రకాలుగా వారి బ్లూ మీడియాలో రాసుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టల్ బ్యాలెట్ లో ఓటేసినపుడు 13 ఏ డిక్లరేషన్ ఇవ్వాలని 19.07.2023లోనే సర్క్యులర్ ఇచ్చారు. అందులో గెజిటెడ్ ఆఫీసర్ సతకం పెట్టాలి. పోలు జరిగిన ఫెలిసేట్ సెంటర్ వద్ద గెజిటెడ్ ఆఫీసర్ ఉండాలి. ఆయనే సంతకం పెట్టి స్టాంప్, సీల్ వేసి ఇవ్వాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఎక్కడైన పొరపాటున స్టాంప్, సీల్ లేకపోయినా అటువంటి బ్యాలెట్స్ ని తిరస్కరించొద్దని వ్యాలిడ్ లోకి తీసుకొని కౌంట్ చేయాలని 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ఇచ్చారు. నేడు దాన్ని ఉటంకిస్తూ 25.07.2024వ తేదిన ఏపీ సీఈఓ పోస్టల్ బ్యాలెట్ ని మేం రిజెక్ట్ చేయము అని స్పష్టంగా సర్క్యులర్ ఇచ్చారు. టీడీపీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్ పై అనుమానాలున్నా, మార్పులు చేర్పులు చేయాలన్నా సీఈఓను కలుస్తున్నారు. కొన్ని చోట్ల స్టాంపులు, సీళ్లు వేయలేదని ఈ సందర్భంగా మేం స్పష్టంగా అడిగాం. పోస్టల్ బ్యాలెట్ వెనుక కొన్ని చోట్ల ఆర్ ఓ సంతకం లేదు. కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నింటిని వ్యాలిడ్ చేయమని ఉంది. రూల్ ఉన్నప్పటికి కూడా ప్రస్తుత అధికారులకు మళ్లీ స్పష్టంగా సర్క్యులర్ ఇస్తే తప్ప పరిస్థితి చక్కబడదు. లేకుంటే పోస్టల్ బ్యాలెట్ పనిచేయకుండా పోయే పరిస్థితి ఉందని అడిగాము. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిని దాన్ని యధాతథంగా వివరిస్తూ ఆయన 25.07.2024వ తేదిన సర్క్యులర్ ఇచ్చారు. ఒకవేళ ఎక్కడైన అటెస్టేషన్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే ఆ వివరాలు రాష్ట్రంలోని అందరు ఆర్వోలకు పంపాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో వెనుక సంతకాలు లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్ లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి ట్యాలీ అయితే వాన్ని కౌంట్ చేసి అలో చేయమని ఆయన స్పష్టంగా చెప్పారు. దాన్ని వైసీపీవారు ఏదో నష్టం జరిగిపోయింది, ఒక విచిత్రమైన సర్క్యులర్ ఇచ్చారు, దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన ఒక రకంగా పోతున్నారంటు నానా యాగి చేస్తూ ఆయనను కలిశారు. ఈ విషయం వారి బ్లూ మీడియాలో దుష్ప్రచారం చేసుకున్నారు. నా సొంత నిర్ణయాలేమీ లేవని, కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిన మేరకు చేశానని సీఈఓ చెప్పారు. వైసీపీవారు హైకోర్టులో దీనిపై కేసు వేశారు. కేసు వేసిన వెంటనే ఏపీ సీఈఓ కేంద్ర ఎన్నికల కమిషనర్ కు లెటర్ రాశారు. ఇచ్చిన క్లారిఫికేషన్ పై మీ అభిప్రాయం తెలపాలని చెప్పడం జరిగింది. అయితే.. నిన్న ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది. అటెస్టేషన్ ఫారమ్ 13 మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలుగానీ, ఆయన స్టాంప్ గానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్ ని తిరస్కరించడానికి వీలు లేదు, వాటన్నింటిని కౌంటింగ్ లోకి తీసుకోవాలని వారు ఇమ్మిడియట్ గా సెక్రటరి కేంద్ర ఎన్నికల కమిషన్ కు లెటర్ రాశారు. కోర్టులో దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు వారికి గొంతులో ఎలక్కాయపడ్డట్టయింది. అయితే కేసు డిస్మిస్ అవుతుంది, లేదంటే మళ్లీ అప్పీలు వేసుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోని మేం ఛాలెంజ్ చేస్తున్నాం అని కోర్టుకు చెప్పిన దానిమీద కోర్టు కూడా అంగీకరించి మేం దానిపై ఛాలెంజ్ చేయండని చెప్పడం జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఇచ్చిన వివరణలో వివాదం లేదని తీర్పు ఇచ్చే సందర్భంలో వైసీపీవారు ప్రస్తుత కేసును వారు కంటిన్యూ చేయకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను విడిగా ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు తెలియజేసింది. అందుకు కోర్టు అంగీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చిన సందర్భంలో తాము ఇచ్చిన వివరణపై వివాదం లేకుండా చేయటం కోసం ఆ వివరణను మాత్రమే (అనగా ధృవీకరణ అధికారి పేరు, హోదా మరియు ఇతర వివరాలను రాష్ట్రంలోని ఆర్ ఓలు అలందరికి పంపించాలన్న పేరా 2(ii) ను ఉపసంహరించుకుంటామని, దీని వలన ఎటువంటి ఆందోళన చెందనవసరంలేదని తెలిపారు. వైసీపీవారు కేసు నుంచి తప్పుకోవటమే కాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క వివరణపై ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పటంలోనే వారి డొల్లతనం తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణను ఛాలెంజ్ చేయటమంటే ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఇచ్చిన వివరణ చట్టబద్దమైంది. సీఈఓ ఆంధ్రప్రదేశ్ కోర్టుకు దాఖలు చేసిన అఫిడెవిట్ లో చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణను పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తూ.చా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణ ప్రకారం ఫారం 13 ఏ ను పైన చెప్పిన అన్ని సందర్భాల్లో దానిని తిరస్కరించటం కుదరదు. కాబట్టి ధృవీకరణ అధికారి వివరాలు రాష్ట్రంలోని ఆర్ ఓలు అందరికి తెలియజేయాల్సిన అవసరం లేదని ఆ పేరాలోని వివరణను ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఉపసంహరించుకోవటం జరిగింది. వైసీసీ దిగజారుడుతనం ఈ కేసులో స్పష్టంగా తెలుస్తోంది. 1+1=2 అని ప్రపంచమంతా అంగీకరించినా కాదు, 11 అని వివాదం చేసే నిత్య అసత్యవాదులు వైసీపీవారు. కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఇచ్చిన వివరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఇచ్చిన వివరణ చివరకు చట్టబద్ధంగా నిలబడుతుంది. వైసీపీవారి కుటిల ప్రయత్నాలు ఖచ్చితంగా వికటిస్తాయి. గత యేడాది 2లక్షల 68 వేల పోస్టల్ బ్యాలెట్స్ లో అనేక కారణాలతో దాదాపు 56 వేల పోస్టల్ బ్యాలెట్స్ ఇన్ వ్యాల్యుడ్ అయ్యాయి. ఇన్ వ్యాల్యుడ్ అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు. ఇటువంటి చిన్న చిన్న వాటిని సర్దుబాటు చేయమని మేం అడిగాం. దాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఒప్పుకున్నాయి. ఇంత జరిగాక ఎందుకు వైసీపీ గోల చేస్తోందో అర్థం కావటంలేదు. వైసీపీ దుష్ప్రచారం వారి దిగజారుడుతనానికి నిదర్శనం ఏదేమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్లీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఎన్నికల కమిషన్ ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణను అమలు చేయాలని కోరనున్నాం. వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచించాలి. ఇది కేవలం ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఇష్యూ. పౌరులందరికీ అప్లై కాదు. వారు కూడా ఈ లిటికేషన్ ను ఎదుర్కోవాలి. వారు కూడా ఈ రిట్ లో కలిస్తే మంచిది. 4 వ తేది తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. వైసీపీవారు ఉక్రోషంతో ఇటువంటి లిటికేషన్స్ తయారు చేస్తున్నారు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले