ఉత్కంఠ
Share with
Views : 5
ఇక జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో జగన్ చర్చించే అవకాశం ఉంది. పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. పోలింగ్ తర్వాత… రెస్ట్ మోడ్ లోకి వెళ్లి నేతలు కౌంటింగ్ వేళ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే పరస్పరం కౌంటర్లు, విమర్శలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ…. ఏపీ ఫలితాలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్టు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రకటించారు. 4వ తేదీ రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కు నియోజక వర్గాల నుంచి వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభా నియోజకవర్గాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగనుంది. 111 నియోజక వర్గాల్లో మద్యాహ్నం 2.00 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు మరియు మిగిలిన 3 నియోజక వర్గాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले